వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయి.
కౌంటింగ్ ఏజెంట్లతో ప్రత్యర్థి పార్టీ అప్రమత్తంగా ఉండాలని, ఇతర పార్టీల ఆటలు సాగనివ్వమని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డిపై ఫిర్యాదు.. క్రిమినల్ కేసు
వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై IPC U/S 153, 505(2) IPC, 125 RTA 1951 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని.. కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో గట్టిగా ప్రశ్నించలేనివారు ఏజెంట్లుగా ఉండొద్దని, నిబంధనల పేరుతో అడ్డుకునే వారిని గట్టిగా నిలదీయాలని, అవసరమైతే ఎంతవరకైనా వాళ్లతో ఫైట్ చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు
పైగా మన లక్ష్యం ఏమిటో దృష్టిలో పెట్టుకుని, దానికి కావాల్సింది ఏంటో తెలుసుకోవాలని, ప్రత్యర్థి పార్టీలు దారిలోకి రాకుండా చూసుకోవాలని, వాటిని అడ్డుకునేందుకు ఎలాంటి నిబంధనలు అమల్లో ఉంటాయో చూడాలి. ఒక్క వైసీపీ ఓటు కూడా వృథా కాకుండా చూసేందుకు రూల్ ప్రకారం వెళ్దాం అంటూ ఊరుకోవద్దని సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటింగ్ ఏజెంట్లకు సూచించారు.
తాడేపల్లి పీఎస్ లో సజ్జలపై కేసు
సజ్జల వ్యాఖ్యలతో టీడీపీ నేతలు దేవినేని ఉమ, గూడపాటి లక్ష్మీనారాయణ తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతనిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఏపీలో కౌంటింగ్ కత్తిమీద సాములా మారింది. ఈ కౌంటింగ్ ఎన్నికల సంఘం, పోలీసులు మరియు రాష్ట్ర పరిపాలనలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది.
కౌంటింగ్‌లో అల్లర్లు సృష్టిస్తే.. కౌంటింగ్‌ను అడ్డుకుంటే నేరుగా జైలుకే
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ఎన్నికల సంఘం అధికారులు.. కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలు సృష్టిస్తే ఏ పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కౌంటింగ్‌ను అడ్డుకునే వారిని అరెస్టు చేసి కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.