Cricket update: చెలరేగిన ఇంగ్లండ్.. భారత్‌ ముందు భారీ టార్గెట్

రెండో వన్డేలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ దుమ్ము దులిపి వదిలారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు టీమిండియాకు 305 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు మొదట నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. తర్వాత దూకుడుగా ఆడి స్కోరు బోర్డుపై పరుగులు సాధించింది.

బెన్ డకెట్ (65), జో రూట్ (69) అర్ధ సెంచరీలు సాధించారు. చివర్లో లివింగ్‌స్టన్ (41) వేగంగా పరుగులు సాధించారు. దీంతో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా, హర్షిత్, హార్దిక్, వరుణ్ చక్రవర్తి, షమీ తలా ఒక వికెట్ తీసుకున్నారు.