RAIN ALERT: కూల్ న్యూస్..తెలంగాణకు వర్ష సూచన.. హైదరాబాద్‌తో పాటు ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్..!!

తెలంగాణలో వాతావరణ పరిస్థితుల్లో అకస్మాత్తుగా మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా హెచ్చరికల ప్రకారం, హైదరాబాద్ నగరంతో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే రెండు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, IMD అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మూడు జిల్లాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు మరియు లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇదిలా ఉండగా, హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఇప్పటికే చల్లబడింది. ఇదిలా ఉండగా, రాబోయే రెండు గంటల్లో వర్ష సూచన ఉన్నందున, ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి ఉద్యోగులు, నగరవాసులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Related News

ఇదిలా ఉండగా, ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో మళ్లీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా నేడు (ఏప్రిల్ 7), రేపు (ఏప్రిల్ 8) అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఏప్రిల్ 7న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.