Congress Party: BRS కు కోలుకోలేని దెబ్బ..ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ లోకి జంప్

Brs  Mlc’s  Join in Congress Party: తెలంగాణలో సంచలన రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో BRS Party కి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్సీలు Congress Party లో చేరారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సీఎం రేవంత్ రెడ్డి గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వీరంతా ఆషాఢ అమావాస్య ముందు రోజు రాత్రి Congress party లో చేరారు. అయితే సీఎం నివాసానికి చేరుకోకముందే ఆరుగురు ఎమ్మెల్సీలు దస్ పల్లా హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా సీఎం నివాసానికి చేరుకున్నారు.

Congress party లో చేరిన వారిలో ఎమ్మెల్సీలు దండే విఠల్, భాను ప్రసాద్, ఎగ్గె మల్లేశం, బుగ్గరపు దయానంద్, ప్రభాకర్ రావు, బస్వరాజ్ సారయ్య తదితరులున్నారు. వీరంతా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కు చేరగా.. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా, రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.

ఒకవైపు వరుస పరాజయాలతో కుంగిపోయిన బీఆర్ఎస్ పార్టీకి నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా ఒకేరోజు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడం బీఆర్‌ఎస్ పార్టీకి చావుదెబ్బ తగిలింది.

నిజానికి గత నెలలో అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై చర్చలు జరిగాయి. వారం రోజుల క్రితమే వీరంతా పార్టీలో చేరాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఓ వైపు ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, మరోవైపు ఆషాడ మాసం వస్తుండటంతో వారంతా ఆషాఢ అమావాస్య ముందురోజు రాత్రి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాగా, రెండు రోజుల క్రితం సీనియర్ నేత కె.కేశరావు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.