విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. సీఎం కుటుంబం రాష్ట్రానికి చేరుకుంది.
గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి, నందిగాం సురేష్, మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, కొత్తో సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు.
అలాగే ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వెలంపల్లి శ్రీనివాసరావు, కైలె అనిల్‌కుమార్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తదితర నేతలు స్వాగతం పలికారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు విమానాశ్రయానికి వచ్చారు.
కాగా, మే 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు లండన్ పర్యటనకు అనుమతి తీసుకుని .. మే 15న లండన్ వెళ్లారు.
జగన్ లండన్ వెళ్లేందుకు నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. సీఎం జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. విదేశాలకు వెళ్లాలంటే నాంపల్లిలోని సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.