గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు..

ఆదాయం, కులం, జననం, మరణం, వంటి సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎంత తిరగాలో అందరికీ తెలుసు. మనం వెళ్ళినప్పుడు, అధికారి ఉండడు.. ఉన్నా వెంటనే పని చెయ్యరు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఒకవేళ ఆఫీసర్ ఉన్నా గాని “దయచేసి రేపు రండి” అంటారు. లేదా లంచం అడుగుతారు. . లంచం ఇవ్వకపోతే ఏమి జరగవు.. అలాగే సర్టిఫికెట్ పొందడానికి నెల నుండి నెలన్నర సమయం పడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సేవలు జనవరి 18 నుండి అందుబాటులోకి వస్తాయి. జననం, మరణం, కులం, అడంగల్ వంటి 150 సేవలను ఆన్‌లైన్‌లో పొందవచ్చు.

Related News

ఈ వ్యవస్థతో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. లంచాల బాధ తప్పుతుంది. అదే సమయంలో, ఈ సేవలను ఎక్కడి నుండైనా పొందవచ్చు.. మనం సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.