పది అర్హతతో ఉద్యోగాలు కోరుకునే వారికి శుభవార్త. ఒకేసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీ వివరాలు
-
- కానిస్టేబుల్ కుక్ – 493
- కానిస్టేబుల్ కాబ్లర్ – 9
- కానిస్టేబుల్ టైలర్ – 23
- కానిస్టేబుల్ బార్బర్ – 199
- కానిస్టేబుల్ వాషర్‌మ్యాన్ – 262
- కానిస్టేబుల్ స్వీపర్ – 152
- కానిస్టేబుల్ పెయింటర్ – 2
- కానిస్టేబుల్ కార్పెంటర్ – 9
- కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్ – 4
- కానిస్టేబుల్ గార్డనర్ – 4
- కానిస్టేబుల్ వెల్డర్ – 1
- కానిస్టేబుల్ ఛార్జ్‌మ్యాన్ మెకానికల్ – 1
- కానిస్టేబుల్ ఎంపీ అటెండెంట్ – 2
మొత్తం పోస్టులు – 1161
Related News
ఈ నియామకం ద్వారా, కానిస్టేబుల్ కుక్, టైలర్, బార్బర్, స్వీపర్, పెయింటర్, గార్డనర్ మొదలైన పోస్టులను భర్తీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారు ఈ అవకాశాన్ని కోల్పోకూడదు.
Qualification: ఈ పోస్టులకు పోటీ చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి పది ఉత్తీర్ణులై ఉండాలి.
Age: అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2025 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు గరిష్ట వయస్సులో సడలింపు ఉంది.
Selection Process: ఈ పోస్టులకు అభ్యర్థులను శారీరక సామర్థ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, CBT పరీక్ష మరియు వైద్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
Salary: కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుండి రూ. 69,100 వరకు జీతం చెల్లిస్తారు.
Application Fee: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.
Online Application: దరఖాస్తు ప్రక్రియ మార్చి 5 నుండి ప్రారంభమవుతుంది.
అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.