మీ పేరు లిస్టులో లేకపోతే ఇంటి కల గల్లంతే! వెంటనే చెక్ చేసుకోండి

Indiramma illu housing scheme 2025

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు ఉచితంగా ఇళ్లు అందజేస్తున్న విషయం తెలిసిందే. నిరాశ్రయులైన నిరుపేద కుటుంబాలకు స్థిర నివాసం కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రవేశపెట్టారు. అయితే, ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది, వీటి ప్రకారం అర్హులైన వారికి మాత్రమే ఇళ్లు లభిస్తాయి. కాబట్టి, మీ పేరు అర్హుల లిస్టులో ఉందా? లేదా? వెంటనే చెక్ చేసుకోండి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఎవరికి ఇందిరమ్మ ఇళ్లు రావు? (అర్హత లేని వారు)

  1. ప్రభుత్వ ఉద్యోగులు – ఏ ప్రభుత్వ శాఖలోనైనా పని చేస్తున్నవారు అర్హులు కాదు.
  2. పన్ను (Income Tax) కడుతున్నవారు – ఆదాయపు పన్ను (IT) కట్టే వ్యక్తులు ఈ పథకం ద్వారా ఇల్లు పొందలేరు.
  3. ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారు – వ్యక్తిగతంగా ఇల్లు కలిగి ఉన్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు.
  4. రూ. 1.5 లక్షలకు పైగా ఆదాయం కలిగినవారు – తక్కువ ఆదాయ గల కుటుంబాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
  5. మునుపటి ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు పొందినవారు – గతంలో ప్రభుత్వం ద్వారా ఇల్లు పొందినవారు మళ్లీ దరఖాస్తు చేయలేరు.
  6. వ్యవసాయ భూమి 2 ఎకరాలకుపైగా ఉన్నవారు – ఎక్కువ భూమి కలిగి ఉన్నవారు అర్హులు కారు.

ఎవరికి ఇందిరమ్మ ఇళ్లు వస్తాయి? (అర్హులైన వారు)

  1. బీపీఎల్ (BPL) కార్డు కలిగినవారు – తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద కుటుంబాలు అర్హులు.
  2. పేదలు, నిరాశ్రయులు – సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇళ్లు కేటాయిస్తారు.
  3. దివ్యాంగులు (Physical Disabilities) ఉన్నవారు – శారీరకంగా అంగవైకల్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
  4. పేద వితంతువులు, వృద్ధులు – ఆదరణ లేని వితంతువులు, వృద్ధులకు ప్రత్యేక కోటా ఉంటుంది.
  5. రాష్ట్ర ప్రభుత్వ డేటాబేస్‌లో ఉన్న లబ్దిదారులు – అర్హులుగా గుర్తించబడినవారు మాత్రమే ఈ పథకం కింద ఇళ్లు పొందుతారు.

మీ పేరు జాబితాలో ఉందా? ఇలా చెక్ చేసుకోండి

  • తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ (https://tshousing.cgg.gov.in) సందర్శించండి.
  • మీ AADHAR లేదా RATION CARD నెంబర్ ఎంటర్ చేయండి.
  •  అర్హత ఉంటే మీ పేరు లిస్టులో కనిపిస్తుంది.

మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తిస్తుందా? వెంటనే చెక్ చేసుకొని, మీ హక్కు పొందండి.