Android mobiles: ఈ ఫోన్లు చూసారంటే.. ఐఫోన్ ను కూడా వద్దంటారు…

2025లో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఐఫోన్ 16 కోసం చాలా మంది ఎగబడుతున్నారు. కానీ అదే సమయంలో మార్కెట్లోని కొన్ని టాప్ ఆండ్రాయిడ్ ఫోన్లు మాత్రం అద్భుతమైన కెమెరా ఫీచర్లతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫొటోలు తీసేప్పుడు కేవలం మంచి కెమెరా ఉండాలన్నదే కాదు. ఓ రేంజ్‌లో డిటెయిల్ ఉండాలి, వీడియోలు కూడా ప్రొఫెషనల్ లెవెల్లో ఉండాలి. అటువంటి కెమెరా ఫోన్లు ఐఫోన్‌కే మాత్రమే ఉంటాయనుకోవడం తప్పు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇప్పటికే గూగుల్, శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, షావోమీ, వివో వంటి బ్రాండ్‌లు తమ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఐఫోన్‌ను మించిన కెమెరా ఫీచర్లు అందిస్తున్నాయి. ఈ ఫోన్లలో వచ్చే ఫోటో క్వాలిటీ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. మరి 2025లో ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం అందుబాటులో ఉన్న టాప్ 6 ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మొదటగా చెప్పుకోవలసింది గూగుల్ పిక్సెల్ 9. ఈ ఫోన్ కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే నిజంగానే DSLR లెవెల్ అనిపిస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. OIS సపోర్ట్‌తో పాటు పిక్సెల్ షిఫ్ట్ టెక్నాలజీ, అల్ట్రా HDR, 4K వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇలాంటి ఫీచర్లు ఐఫోన్ 16 కన్నా ఏ మాత్రం తగ్గదు. అందులోనూ గూగుల్ ప్రత్యేకంగా కెమెరా కోసం ఫైన్‌ట్యూన్ చేస్తుంది కాబట్టి ఫోటోలు మరింత ప్రీమియంగా కనిపిస్తాయి. ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో సుమారు రూ.79,999గా ఉంది.

Related Posts

దీని తర్వాత మాట్లాడుకోవాల్సింది వివో X200 గురించి. ఇది అసలు కెమెరా కోసం పుట్టిన ఫోన్ అన్నట్టే ఉంటుంది. ఇందులో 50MP త్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మల్టీఫేస్ కెమెరాలు కావడం వల్ల నీవు తీసే ప్రతి ఫొటోలో మంచి డెప్త్, కలర్ ఉండటం గ్యారంటీ. Zeiss ఆప్టిక్స్ ట్యూన్ చేసిన కెమెరా కాబట్టి ప్రొఫెషనల్ ఫోటోలు వస్తాయి. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉండటం మరో ప్రత్యేకత. దీనివల్ల వీడియో కాలింగ్, వ్లాగింగ్, రీల్స్ వంటి వాటికీ ఇది బెస్ట్. దీని ధర సుమారు రూ.65,999గా ఉంది.

ఒప్పో ఫైండ్ X8 కూడా కెమెరా లవర్స్ కోసం డిజైన్ చేసిన స్పెషల్ ఫోన్. ఇందులో ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ ఉంది. వైడ్ అంగిల్, పెరిస్కోప్ జూమ్, అల్ట్రా వైడ్ లెన్స్‌లతో ఇది కవర్ చేయలేనిదేదీ లేదు. హాసెల్‌బ్లాడ్ ట్యూన్ కెమెరా కావడంతో కలర్ టోన్, డెఫినిషన్ చాలా హై స్టాండర్డ్‌గా ఉంటుంది. అలాగే ఇందులోని 32MP ఫ్రంట్ కెమెరా కూడా 4K రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. 4K వీడియో, డాల్బీ విజన్‌తో సినిమాటిక్ క్వాలిటీ వస్తుంది. దీని ధర సుమారు రూ.68,999గా ఉంది.

ఇంకా శాంసంగ్ గెలాక్సీ S25+ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శాంసంగ్ ఎప్పుడూ కెమెరా రంగంలో తనదైన ముద్ర వేస్తూ ఉంటుంది. ఈ సారి కూడా అదే జరిగింది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 3x ఆప్టికల్ జూమ్‌తో పాటు HDR10+ సపోర్ట్, 8K వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఫోటోలు నచ్చేలా వస్తాయి. ధర విషయానికి వస్తే ఇది సుమారు రూ.99,999 నుంచి మొదలవుతుంది.

వన్‌ప్లస్ 13 కూడా ఈ రేసులో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇందులో హాసెల్‌బ్లాడ్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే ప్రీమియం 6.82 అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్‌లో 8K వీడియో రికార్డింగ్, భారీ 6000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కేవలం కెమెరా పరంగా మాత్రమే కాదు, మొత్తం పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఐఫోన్ 16కు పోటీనిస్తుందన్నమాట. దీని ధర రూ.69,998గా ఉంది.

ఇక చివరగా షావోమీ 15 గురించి మాట్లాడుకోవాలి. ఈ ఫోన్ కెమెరా సెటప్ కూడా లైకా ఆప్టిక్స్‌తో ట్యూన్ చేయడం వలన ప్రొఫెషనల్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇందులో 50MP మేన్ సెన్సార్, 50MP టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 8K HDR వీడియో రికార్డింగ్, డాల్బీ విజన్ వంటి హైఎండ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది అమెజాన్‌లో రూ.64,999కి లభిస్తుంది.

ఈ ఫోన్లు చూస్తే మీకు అనిపించకమానదు – ఐఫోన్ ఒక్కటే కాకుండా బెస్ట్ కెమెరా ఫోన్లు ఆండ్రాయిడ్‌లో కూడా చాలానే ఉన్నాయని. ఒక్కో ఫోన్ ఒక్కో స్పెషాలిటీ కలిగి ఉంది. ప్రొఫెషనల్ ఫోటోలు కావాలంటే గూగుల్ పిక్సెల్ 9 ట్రై చేయవచ్చు. వీడియోలు ఎక్కువగా తీసేవారికి వన్‌ప్లస్ 13, ఒప్పో ఫైండ్ X8 మంచి ఎంపిక. సెల్ఫీ ప్రియులు వివో X200 వైపు మొగ్గు చూపవచ్చు. గేమింగ్‌తో పాటు కెమెరా కావాలంటే శాంసంగ్ S25+ మిస్ కాకూడదు.

ఈ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు కేవలం ధర పరంగా మాత్రమే కాదు, ఫీచర్ల పరంగా కూడా ఐఫోన్ 16కి పోటీగా ఉన్నాయి. అంతేకాకుండా కొన్నిచోట్ల ఐఫోన్ కన్నా బెటర్ ఫీచర్లు ఉండటం విశేషం. పైగా ఆండ్రాయిడ్ ఫోన్లలో కస్టమైజేషన్, ఫాస్ట్ చార్జింగ్, హై బ్యాటరీ వంటి అదనపు లాభాలు కూడా ఉంటాయి. ఫొటో లవర్స్, వీడియో క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లువెన్సర్స్.. ఎవరి కోసమైనా ఈ ఆండ్రాయిడ్ కెమెరా ఫోన్లు బెస్ట్ ఆప్షన్.

అంతేకాకుండా తాజా ట్రెండ్‌ను ఫాలో అవుతూ, 2025లో మీరు కూడా DSLR క్వాలిటీ ఫొటోలు తీసే ఫోన్ కొంటే, ఫ్రెండ్స్‌ను ఫిదా చేసేయవచ్చు. మరి ఏం చూస్తున్నారు? ఐఫోన్‌ను పక్కన పెట్టి ఈ కెమెరా మాన్స్టర్స్‌కి ఒక ఛాన్స్ ఇవ్వండి!