ఈ రోజుల్లో మన చేతిలో ఉండే మొబైల్ ఎంత ఫ్యాషన్‌గా ఉంటుందో కూడా చాలామందికి ఎంతో ముఖ్యం. పెద్ద పరిమాణం ఉన్న ఫోన్లను పట్టుకోవడం కష్టం అవుతుంది. ఒక్క హ్యాండ్లో అందిపోతుందా? పట్టుకునేందుకు సౌకర్యంగా ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలు మనలో వచ్చే సమయమిది. అందుకే ఇప్పుడు మార్కెట్లో స్లిమ్ ఫోన్ల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. చూడడానికి స్టైలిష్‌గా ఉండి, ఫీచర్లలో మాత్రం తక్కువేమీ లేకుండా ఉండే స్లిమ్ ఫోన్లు ఇప్పుడు అందరికీ కావాలి.
అలాంటి ఫోన్లు కొనే ఆలోచనలో ఉన్నవాళ్ల కోసం ఈరోజు మేము మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ 3 స్లిమ్ స్మార్ట్ఫోన్ల వివరాలు తీసుకొచ్చాము. వీటిలో నువ్వు చూసే ఫీచర్లు, డిజైన్, బ్యాటరీ లైఫ్ అన్నీ ఆకట్టుకుంటాయి. పైగా కొన్ని ఫోన్లు తక్కువ ధరకే కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఫోన్లు త్వరగా స్టాక్ అవుట్ అవుతున్నాయి. అలాంటి ఫోన్ కావాలంటే ఇప్పుడే ఓ లుక్కేయండి.
Samsung Galaxy S25 – స్లిమ్ బాడీలో పవర్ఫుల్ పర్ఫామెన్స్
సామ్సంగ్ నుండి వచ్చిన గెలాక్సీ ఎస్ 25 ఫోన్ ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్. దీని బాడీ తిన్నెస్ కేవలం 7.20 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే మీరు జేబులో పెట్టుకుంటే ఫోన్ ఉన్నా లేదా అనిపించదు. కానీ డిజైన్ మేటే కాదు, ఇందులో ఉన్న ఫీచర్లు కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి.
Related News
ఈ ఫోన్లో Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉండటంతో ఏ పని అయినా వేగంగా జరుగుతుంది. ఒకేసారి బాగా యాప్స్ ఓపెన్ చేసినా ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది. 12 జీబీ ర్యామ్‌తో గేమింగ్‌కి కూడా బాగా సరిపోతుంది. ఫొటో ప్రేమికుల కోసం ఇందులో 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ ప్రేమికుల కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికొస్తే 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది మీ సాధారణ అవసరాలకు చాలు. ఫోన్ ధర ప్రస్తుతం ₹80999 నుండి ప్రారంభమవుతుంది. అయితే ఆఫర్లు, కార్డ్ డిస్కౌంట్లు వాడుకుంటే కొంత తక్కువకూ దొరకవచ్చు.
Oppo Reno 13 – స్టైలిష్ లుక్‌తో స్ట్రాంగ్ బ్యాటరీ బ్యాకప్
ఒప్పో నుంచి వచ్చిన ఈ ఫోన్ thickness కేవలం 7.24 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే ఇది చాలా స్లిమ్‌గా ఉంటుంది. దీన్ని ఒక చేతితోనే సులభంగా పట్టుకోవచ్చు. ఎటు తీసుకెళ్లినా స్టైల్‌గా కనిపిస్తుంది. దీని డిజైన్ మురిపెంతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
ఇందులో మిడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంది. ఇది కొత్త టెక్నాలజీ ప్రాసెసర్. పనితీరు చాలా వేగంగా ఉంటుంది. ఫోన్‌కి 8 జీబీ ర్యామ్ ఉంది. 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఫోటోలు బాగా వస్తాయి. ఫ్రంట్ కెమెరా కూడా అదే 50 మెగాపిక్సెల్ కావడం విశేషం. అంటే సెల్ఫీలు ఎక్కువ తీసుకునేవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. బ్యాటరీ విషయానికొస్తే దీని సామర్థ్యం 5600 ఎంఏహెచ్. అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా చాలు. 6.59 ఇంచుల AMOLED డిస్ప్లేతో వస్తున్న ఈ ఫోన్ ధర ₹35710 మాత్రమే. దీన్ని ఆన్లైన్లో కొంటే మరింత తగ్గింపు ఉండొచ్చు.
Vivo V50 – స్లిమ్, శక్తివంతమైన, బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్
వివో కంపెనీ నుండి వచ్చిన ఈ ఫోన్ thickness 7.99 మిల్లీమీటర్లే. అంటే ఇది కూడా చాలాస్లిమ్గా ఉంటుంది. చూసిన వెంటనే ఈ ఫోన్ డిజైన్‌కి ఫిదా అయిపోతారు. ముఖ్యంగా బడ్జెట్ లో మంచి ఫీచర్లతో ఫోన్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్.
ఈ ఫోన్ ధర ₹34999 లోపే. ఇందులో Qualcomm Snapdragon 7 Gen 3 చిప్సెట్ ఉంటుంది. ఇది మంచి AI సామర్థ్యంతో పని చేస్తుంది. గేమ్స్, వీడియో ఎడిటింగ్, యాప్స్ ఓపెన్ చేయడం ఇలా ఏదైనా వేగంగా జరుగుతుంది. డిస్ప్లే విషయానికొస్తే ఇందులో 6.77 ఇంచుల FHD+ AMOLED స్క్రీన్ ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ కూడా హై. ఫోన్‌కి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అంటే మంచి ఫోటోలు రావడం ఖాయం. బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ ఉండటం విశేషం. ఇది ఎక్కువ సమయం ఫోన్ వాడే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది.
ఇక మీరు కూడా ట్రెండులోకి వచ్చేయండి
ఈ మూడు ఫోన్లు తమ స్లిమ్ డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఫీచర్లతో కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మీ చేతిలో ఉండే ఫోన్ మీ వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది అందుకే ఇప్పుడు మీరు స్లిమ్, స్టైలిష్, ఫాస్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నా, ఇవే సరైన ఎంపికలు.
ఇప్పుడే ఆర్డర్ చేయండి. ఇవి త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి. లేటయితే లాస్… ఈ వేసవిలో మీ స్టైల్‌కి కొత్త డెఫినిషన్ ఇవ్వాలంటే… ఈ స్లిమ్ ఫోన్లను మిస్ అవ్వకండి…