Andhra Pradesh లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు భారీ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. June 12న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.కానీ మరోవైపు వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు అదే రోజున పునఃప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో ఈనెల 12న కాకుండా 13న పాఠశాలలను తెరవాలని TDP MLC AS Ramakrishna Principal Secretary Praveen Prakash కు వినతిపత్రం అందజేశారు. పాఠశాలల పునఃప్రారంభ తేదీని వాయిదా వేయాలని TDP MLC AS Ramakrishna అందులో కోరారు. ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నందున వాయిదా వేయాలని కోరారు. దీంతో ఏపీలో పాఠశాలల పునఃప్రారంభ తేదీ వాయిదా పడే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని పాఠశాలలకు April 24 నుంచి June 11 వరకు దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటించిన విద్యాశాఖ.. సెలవుల అనంతరం 2024-25 విద్యా సంవత్సరానికి గాను June 12 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తాజా పరిణామంతో ఒకరోజు తర్వాత అంటే June 13న పాఠశాలలు తెరుచుకునే అవకాశం ఉందని సమాచారం.మరోవైపు తెలంగాణలో April 24 నుంచి ప్రారంభమైన వేసవి సెలవులు June 11తో ముగియనుండగా.. June 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.