CM Chandrababu: చంద్రబాబు హామీ..యధావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు..

నిన్న ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కొన్ని చోట్ల ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. తమకు రావాల్సిన నిధులను విడుదల చేయాలనే డిమాండ్ తో వైద్య సేవలు నిలిపివేయడంతో సీఎం చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు.. ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రతినిధులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతపై వైద్య అధికారులతో సీఎం చర్చించారు. వారి డిమాండ్ల గురించి అడిగిన తర్వాత.. ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించిన బకాయిలు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దీని కోసం రూ.500 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ఆయన అన్నారు. పేదలకు అందించే వైద్య సేవల విషయంలో ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని నిధులు విడుదల చేస్తారు.. హామీతో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ వైద్య సేవలలో భాగంగా అందిస్తున్న చికిత్సకు.. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.3,500 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే చికిత్స కొనసాగిస్తామని డిమాండ్ చేస్తూ.. సోమవారం ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేశారు. దీని కారణంగా ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Related News