Chandigarh Dibrugarh Express Derails: చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు (15904) గురువారం ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్‌లోని గోండా సమీపంలో పట్టాలు తప్పింది.
గోండా, జిలాహి మధ్య పికౌరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. క్షతగాత్రులకు వెంటనే వైద్య సహాయం అందించాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 17 మంది గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. పట్టాలు తప్పిన బోగీల నుంచి ప్రయాణికులను స్థానికుల సాయంతో రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Related News
ఈ ప్రమాదంపై సామ్ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా స్పందించారు. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రయాణికుల సాయం కోసం రైల్వే శాఖ హెల్ లైన్ నంబర్లను ప్రకటించింది.
In regard with the derailment of 15904 Dibrugarh Express in Lucknow division of North Eastern Railway, the helpline numbers are issued. pic.twitter.com/pe3CECrnmf
— Ministry of Railways (@RailMinIndia) July 18, 2024