CBDT recruitment 2025: ఆదాయపు పన్ను శాఖ 2025: ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం (ప్రభుత్వ ఉద్యోగం) కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఇది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ B పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు సంబంధిత అర్హతలు ఉన్న అభ్యర్థులెవరైనా ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్, incometaxindia.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ ఆదాయపు పన్ను శాఖ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఎవరైనా నోటిఫికేషన్ విడుదలైన 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఆదాయపు పన్ను శాఖలో మొత్తం 08 పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ఇచ్చిన పాయింట్లను జాగ్రత్తగా చదవాలి.
అర్హత:
ఆదాయపు పన్ను శాఖ ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్న ఏ వ్యక్తి అయినా అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హత ఉండాలి. అప్పుడే వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థికి లెవల్ 7 కింద రూ.44,900 నుండి 1,42,400 వరకు జీతం ఇవ్వబడుతుంది.
వయో పరిమితి:
గరిష్ట వయోపరిమితి 56 సంవత్సరాలుగా సెట్ చేశారు. ఇది నోటిఫికేషన్‌లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం నిర్ణయించబడును .
మరింత సమాచారం:
ఈ ఆదాయపు పన్ను శాఖ రిక్రూట్‌మెంట్ కోసం, అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపి సంబంధిత పత్రాలతో క్రింద పేర్కొన్న చిరునామాకు పంపాలి.
డైరెక్టరేట్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ (సిస్టమ్),
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్,
గ్రౌండ్ ఫ్లోర్, E2,
ARA సెంటర్, ఝండివాల్ ఎక్స్‌టెన్షన్.