నేటి కాలంలో డబ్బును పొదుపు చేయడం కంటే సరైన పెట్టుబడి (Investment) చేయడం ముఖ్యం. బ్యాంక్ FD కంటే ఎక్కువ రాబడి, చిన్న మొత్తాలతో ప్రారంభం – ఇదంతా SIP మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సాధ్యం.
కానీ, చాలామందికి ఇంకా మ్యూచువల్ ఫండ్స్ అంటే స్పష్టత లేదు. అందుకే ఈ ప్రశ్నలు – సమాధానాలు చదివి, మీరు కూడా స్మార్ట్ ఇన్వెస్టర్ అవ్వండి
ప్రశ్న 1: మ్యూచువల్ ఫండ్ అంటే అసలు ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది?
- మ్యూచువల్ ఫండ్ అనేది పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని సాధారణ ప్రజలకు బెస్ట్ ఆప్షన్.
- SIP (Systematic Investment Plan) ద్వారా రూ.500 లేదా రూ.1000 లాంటి చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి పెట్టొచ్చు.
- మీ డబ్బును నిపుణులు (Fund Managers) స్టాక్ మార్కెట్, డెట్ మార్కెట్ లేదా ఇతర ఆస్తులలో పెట్టుబడి పెడతారు.
- మీరు పెట్టిన మొత్తానికి బట్టి రాబడి (Returns) వస్తాయి – దీని వల్ల మీరు FD కంటే ఎక్కువగా సంపాదించగలరు
- దీర్ఘకాలికంగా (Long Term) మ్యూచువల్ ఫండ్స్ బాగా పెరుగుతాయి, కాబట్టి 10-15 ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే లక్షలు రావచ్చు
ప్రశ్న 2: నేను SIP ద్వారా రూ.500 పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుంది?
ఇది మీ పెట్టుబడి కాలానికి (Duration) మరియు మార్కెట్ పెర్ఫార్మెన్స్ పై ఆధారపడుతుంది. కానీ ఓ మాదిరి లెక్క చూస్తే –
Related News
- రూ.500/నెల – 10 ఏళ్ల పాటు (12% CAGR రాబడి)
- మొత్తం పెట్టుబడి: ₹60,000
- అంతట్లో మీ సంపాదన: ₹1,15,000+
2. రూ.5000/నెల – 15 ఏళ్ల పాటు (12% CAGR రాబడి)
- మొత్తం పెట్టుబడి: ₹9,00,000
- అంతట్లో మీ సంపాదన: ₹35,00,000+
మార్కెట్ పెరుగుతుంటే, మీ డబ్బు కూడా పెరుగుతుంది. ఇది బ్యాంక్ FD లాగా స్థిరమైన వడ్డీ కాకపోయినా, ఎక్కువ సొమ్ము పోగొట్టుకోకుండా ఎక్కువ Returns తీసుకురావడానికి SIP బెస్ట్.
ఇప్పుడు మీ టర్న్
మీరు రూ.500తో SIP స్టార్ట్ చేయకపోతే, లాంగ్ టర్మ్‌లో ఎంత నష్టపోతారో ఊహించండి. మీ డబ్బు వృధా కాకుండా, ఇప్పుడే పెట్టుబడి పెట్టండి.