ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ iQOO అనేక ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తోంది. ఇటీవల మార్కెట్లో కంపెనీ iQOO 13 5G పేరిట స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది. ఈ ఫోన్ లాంచ్ అయినా నుంచి ప్రకంపనలు సృష్టించింది.
ఈ ఫోన్ యూజర్లను ఎంతగానో ఆకర్షించింది. ముఖ్యంగా.. యూజర్లు ఈ ఫోన్ రియల్ టైమ్ అనువాదం, కెమెరాలోని AI ఫీచర్‌ను ఇష్టపడుతున్నారు. ఒకవేళ మీరు iQOO 13 5G ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటే, ఇదే మీకు సరైన సమయం అని చెప్పవచ్చు. ఈ ఫోన్‌పై అమెజాన్ అద్భుతమైన డీల్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ లో మీరు ఈ ఫోన్‌ను రూ. 30,000 లోపు కొనుగోలు చేయవచ్చు.
ఆఫర్
అమెజాన్‌లో iQOO 13 5G ప్రస్తుతం 12GB+256GB వేరియంట్ ధర రూ. 54,999కు లభిస్తోంది. అయితే ప్లాట్‌ఫారమ్ iQOO 13 5G ఫోన్‌పై రూ. 2000 బ్యాంక్ ఆఫర్‌ను అందిస్తోంది. ఆ తర్వాత దీని ధర రూ. 52,999 అవుతుంది. ఇది కాకుండా.. అమెజాన్ ఈ ఫోన్‌పై రూ.27,350 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందిన తర్వాత, ఫోన్ ధర రూ.25,649 కే కొనుగోలు చేయొచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీ పాత ఫోన్ ధర దాని పరిస్థితి, మోడల్ ఆధారంగా నిర్ణయించబడుతుందని మీరు గుర్తుంచుకోవాలి.
iQOO 13 5G స్మార్ట్ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్స్ చూస్తే..
డిస్ప్లే
ఇకపోతే iQOO 13 5G ఫోన్ 13 6.82 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్‌లోని Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్ సూపర్‌కంప్యూటింగ్ చిప్ 2తో అమర్చారు. వేరియంట్ల విషయానికి వస్తే.. iQOO 13 5G స్మార్ట్ ఫోన్ 12GB RAM, 256GB వెర్షన్ లో అందుబాటులో ఉంది.
కెమెరా
అద్భుతమైన ఫోటోలు తీయడానికి iQOO 13 ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రధాన కెమెరా 50MP సోనీ IMX921 సెట్ చేసారు. ఇది కాకుండా.. 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ టెలిఫోటో లెన్స్, 50MP ISOCELL JN1 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 32MP సెల్ఫ్ షూటర్ ఉంది.
బ్యాటరీ
బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
AI ఫీచర్లు
iQOO 13 5G ఫోన్ కెమెరా AI తో తయారు చేయబడింది. AI ఫోటో ఎన్‌హాన్సర్ సహాయంతో ఫోటో స్పష్టత, రంగు రెండింటినీ మెరుగుపరచవచ్చు. అంతేకాకుండా.. ఫోన్‌లో లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్ సౌకర్యం ఉంది. అంటే.. ఎవరైనా ఫోన్‌లో వేరే భాషలో మాట్లాడుతుంటే, ఈ ఫోన్ దాన్ని నిజ సమయంలో మీ భాషలోకి అనువదించి టెక్స్ట్ రూపంలో ఇస్తుంది.