అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం తండేల్. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. విడుదలకు ముందే ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకుంది. సినిమాపై భారీ అంచనాలను పెంచింది. పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
విడుదలకు ముందే క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న వాలెంటైన్స్ డే కానుకగా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుండే దీనికి మంచి టాక్ వస్తోంది. అంతేకాకుండా, కలెక్షన్ల పరంగా నాగ చైతన్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. అయితే, ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు పూర్తి మార్కులు పడ్డాయి. దేవి శ్రీ ప్రసాద్ కూడా తన సంగీతంతో ఆకట్టుకున్నాడు.
అయితే, విడుదలకు ముందే చాలా ఫేమస్ అయిన పాట ఉంది. అది బుజ్జి తల్లి పాట. ఈ పాట యూట్యూబ్ లో అత్యధికంగా విన్న పాటల జాబితాలో కూడా చేర్చబడింది. ఇది ఇప్పటికీ యూత్ ప్లే లిస్ట్ లో మొదటి స్థానంలో ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి ట్రెండ్ సృష్టించిన ఈ పాట పూర్తి వీడియో విడుదలైంది.