Budget 2024: ఉద్యోగులకు ఊరట లేదు.. అవే పన్నులు కట్టండి..

ఉద్యోగుల పన్ను విధానంలో ఎలాంటి మార్పు లేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు పన్ను విధానంలోనే ఎలాంటి మార్పులు చేయలేదు. గతేడాది నాటి విధానాన్నే అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దిగుమతి, ఎగుమతి సుంకాల్లో ఎలాంటి మార్పు లేదని.. ఉద్యోగులు, వ్యాపారులు చెల్లించే ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పు లేదని.. యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటించారు.

గత బడ్జెట్లో ప్రకటించిన విధంగా స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి 75 వేల రూపాయలకు పెంపుదల మార్చి 2024 నుంచి అమల్లోకి వస్తుందని.. కొత్త శ్లాబ్ రేట్లలో ఎలాంటి మార్పు లేదని గమనించాలి

Related News

ప్రస్తుతం ఉన్న పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని వెల్లడించారు. అయితే ప్రత్యక్ష పన్నులు మూడు రెట్లు పెరిగాయి. కార్పొరేట్ పన్నును 30 నుంచి 22 శాతానికి తగ్గించడం గత బడ్జెట్లో తీసుకున్న నిర్ణయమని ఆమె స్పష్టం చేశారు.

ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు లేవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎన్నికల ముందు తాత్కాలిక బడ్జెట్ కావడంతో ఆర్థిక మంత్రి కొత్త ప్రతిపాదనలు చేయకుండా శాఖల వారీగా కేటాయింపులకే పరిమితమయ్యారు.