కొత్త ప్రభుత్వం లో , ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెలాఖరులో 2024-25 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు . ఈ ఇయర్ ప్రారంభం నుంచి టాక్స్ విషయంలో కొంత ఉపశమనం, రాయితీలు లభిస్తాయని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
శాలరీ పొందే టాక్స్ చెల్లింపుదారులకు టాక్స్ మినహాయింపును అందించడం వల్ల ఖర్చులు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం టాక్స్ రాయితీ చర్యలను పరిశీలిస్తోందని, బడ్జెట్‌ను సమర్పించేలోపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు సూచించాయి. అయితే ఈసారి బడ్జెట్‌లో ఉద్యోగులకు మేలు చేసేలా మూడు ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.
Related News
1. కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచే అవకాశాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి .
2. మీడియా నివేదికల ప్రకారం, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం పన్ను స్లాబ్‌లను క్రమబద్ధీకరించవచ్చు. పన్నులు తగ్గించవచ్చు. ప్రస్తుతం, కొత్త విధానంలో పన్ను రేట్లు ఆదాయ స్థాయిని బట్టి 5 నుంచి 30 % వరకు ఉంటాయి.
3. కేంద్ర బడ్జెట్ 2023 కొత్త వ్యక్తిగత పన్ను విధానంలో పన్ను స్లాబ్‌లలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చిందని డెలాయిట్ ఇండియా నివేదించింది.
ఇందులో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచడం,
రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి సర్‌చార్జిని 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడం వంటివి ఉన్నాయి.
కొత్త పన్ను విధానం యొక్క ఆకర్షణను పెంచడానికి ఈ సర్దుబాట్లు అమలు చేయబడ్డాయి. అయితే, పాత పన్ను విధానంలో పన్ను రేట్లు మారవు. .