ఇటీవల ప్రముఖ టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశమంతటా వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ కు సిమ్ ను పోర్ట్ చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఇతర టెలికం సంస్థల్లో రీఛార్జ్ ధరలను పోలిస్తే ఇందులో తక్కువగా ఉండటం. దీనికి అనుగుణంగానే ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ యూజర్లను ఆకర్షించేందుకు అనేక కొత్త ప్లాన్లను తీసుకు వస్తూనే ఉంది. అయితే, మీరు బ్రాడ్ బ్యాండ్ ఇన్స్టాల్ చేసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బిఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ ఆర్మ్ భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ బేసిక్ ఓటిటి ప్లాన్ అందిస్తోంది. తక్కువ ధరలో మనీ ప్లాంట్ కోసం వెతుకుతున్నట్లయితే ఇది మీకు సరైనది. ఈ ప్లాన్ ను మొత్తం మూడు నెలల పాటు ఉచితంగా ఉపయోగించవచ్చు. ఇది మాత్రమే కాదు.. ఈ ప్లాన్ లో యూజర్లు వేగవంతమైన ఇంటర్నెట్ తో పాటు ప్రతి నెల 4000gb డేటాను కూడా పొందుతారు. ఈ ప్లాన్ ద్వారా కేవలం రూ.599 మాత్రమే. ఈ ప్లాన్ లో వినియోగదారులు 75 ఎంబిబిఎస్ ఇంటర్నెట్ వేగం కూడా పొందుతారు. అయితే మీ 4000 జిబి డేటా పూర్తి చేసినప్పటికీ మీరు 4 mbbs వేగంతో అపరిమితి ఇంటర్నెట్ను కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ ప్లాన్ లో కస్టమర్లు డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ సూపర్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందుతారు.
అంతేకాకుండా ఒకవేళ వినియోగదారులకు ల్యాండ్ లైన్ పరికరం సొంతంగా ఉంటే అపరిమిత కాలింగ్ కోసం ఈ ప్లాన్ ద్వారా ఉచిత లైలాండ్ కనెక్షన్ కూడా పొందుతారు. అదనపు ప్రయోజనాలు చూస్తే ఈ ప్లాన్ లో డిస్నీ ప్లేస్ హాట్స్టార్ సూపర్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ ధర నెలకు రూ.599. కాగా, ఒకవేళ మీరు మొత్తం 12 నెలలకు ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే మీరు రూ.7188 చెల్లించాలి. ఏడాది ప్లాన్ ను ఎంచుకుంటే కంపెనీ వినియోగదారులకు ఒక నెల ఉచితంగా అందిస్తుంది. మరోవైపు మీరు 24 నెలలు ఎంపికను ఎంచుకుంటే మీరు రూ.14 376 ఒకేసారి చెల్లించాలి. అప్పుడు కంపెనీ వినియోగదారులకు మూడు నెలల ఉచిత సేవలు కూడా అందిస్తుంది.