Breaking: ఏపీ సచివాలయంలో సోదాలు

ఏపీలో పలు కీలక పరిణామాలు జరుగుతున్నాయి . ప్రభుత్వం మారిన తర్వాత ఐటీ కమ్యూనికేషన్ విభాగం పోలీసుల అప్రమత్తమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న డేటా బయటకు వెళ్లకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అనేక ఫైళ్లు, కంప్యూటర్లు మరియు ల్యాప్‌టాప్‌లను పర్యవేక్షించారు. ఈ మేరకు సచివాలయంలో సోదాలు నిర్వహించారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను పరిశీలించారు. ల్యాప్‌టాప్‌లను బయటకు తీయవద్దని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

కొత్త ప్రభుత్వం ఏర్పడి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.