Samosa new recipe: అప్పడాలతో ఆనియన్ సమోసా.. ఎప్పుడు ట్రై చేసి ఉండరు..

సమోసా అంటేనే మనకు నోరు జారిపోతుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడే ఈ స్పైసీ స్నాక్‌లో ఆనియన్ సమోసాకు ప్రత్యేక స్థానం ఉంది. సినిమా చూస్తూ లేదా ఈవెనింగ్ టీ తాగుతూ బయట స్టాల్‌‍లలో ఏదైనా స్నాక్ ఆర్డర్ చేస్తే ముందు గుర్తొచ్చేది ఇదే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే ఇందులో ఓ పెద్ద సమస్య ఉంది – షీట్స్ తయారీ. మైదా కలిపి చపాతీలా రోల్ చేసి, తరిగి షీట్స్ చేయాలి. టైమ్ చాలా తీసుకుంటుంది. అందుకే చాలా మంది రెడీమేడ్ షీట్స్ కొనుగోలు చేస్తారు.

ఇకపై షీట్స్ పని లేదు.. అప్పడాలతో సమోసా తయారీ

ఈ ఆర్టికల్‌లో మేము చెప్పబోయే ట్రిక్‌ను మీరు ఫాలో అయితే, షీట్స్ అవసరం లేకుండా సమోసా తయారవుతుంది. అదీ క్రంచీగా, టేస్టీగా, చాలా తక్కువ టైమ్‌లో! ఇంట్లో ఉండే అప్పడాలతోనే మీరు ఈ ఆనియన్ సమోసా చేసేయొచ్చు. ఇదో క్లీవర్ ట్రిక్. ఇంట్లో మామూలుగా ఉండే అప్పడాలను వాడి, సూపర్ క్రిస్పీ సమోసాలను మీరు తయారు చేయవచ్చు.

స్టఫ్ఫింగ్ తయారీ చాలా ఈజీ

స్టఫ్ఫింగ్ తయారు చేయడం మొదట. ఓ పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేలా మగ్గించాలి. తర్వాత తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కలపాలి. ఉప్పు వేసి ఉల్లిపాయలు లైట్‌గా కలర్ మారేంతవరకు వేయించాలి. తర్వాత పసుపు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి. చివరగా టమాటా సాస్ వేసి ఇంకో నిమిషం మగ్గించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇదే మన స్టఫ్ఫింగ్. దాన్ని పక్కన ఉంచండి.

అప్పడాలతో సమోసా షేప్ ఎలా ఇవ్వాలి?

ఇప్పుడు మైదా పిండి తీసుకుని కొద్దిగా నీళ్లతో పేస్ట్‌లా చేయాలి. తర్వాత గుండ్రంగా ఉండే అప్పడాలను ఒక వైపు కట్ చేయాలి – సమోసా షీట్స్‌లా కనబడేలా. వాటిని నీటిలో ఓసారి ముంచి బయటకు తీయాలి – అలా తడి చేస్తే సాఫ్ట్‌గా ముడిపడతాయి. ఇప్పుడు అర్థప్పడాన్ని కోన్ ఆకారంలో ముడివేసి మద్యలో స్టఫ్ఫింగ్ పెట్టాలి. మైదా పేస్ట్‌తో అంచులను అంటించాలి. అలా మొత్తం సమోసాలా తయారు చేసుకోవచ్చు.

డీప్ ఫ్రై చేసి వేడివేడిగా సర్వ్ చేయండి

స్టవ్ ఆన్ చేసి తగినంత నూనె వేడి చేయాలి. నూనె హీటెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో సమోసాలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత టిష్యూ పేపర్‌పై ఉంచాలి – ఎక్స్‌ట్రా ఆయిల్ బయటికి వచ్చేస్తుంది. ఇక ఫినిష్! గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే కమ్మగా టేస్ట్ ఉంటుంది.

ఇవి గుర్తుంచుకోండి

ఉల్లిపాయలు ఎక్కువగా మెత్తగా కాకూడదు. అప్పడాలను నీటిలో ఎక్కువసేపు ఉంచితే అవి మురికిగా మారతాయి. రెండు వైపులా తడి చేయడం సరిపోతుంది. అంచులను బాగా అంటించకపోతే స్టఫ్ఫింగ్ బయటికి వచ్చేస్తుంది. మీడియం హీట్‌లోనే వేయించాలి – అప్పుడు సమోసాలు బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి టేస్టీగా తయారవుతాయి.

ఇది నిజంగా ఓ సూపర్ ట్రిక్. షీట్స్ అవసరం లేకుండా కేవలం అప్పడాలతోనే ఆనియన్ సమోసా రెడీ అవుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే వేరే వాళ్ళ ముందు మీరు చెబుతారు. ఇలాంటివి రోజూ చూస్తాం కదా? కానీ ఇదంత వండర్‌ఫుల్‌గా వర్కౌట్ అవుతుందని మీకు తెలుసా? వెంటనే ట్రై చేయండి…  మర్చిపోకండి.