లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW తన కొత్త కారు BMW X3ని ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో రెండు వేరియంట్లతో మార్కెట్లో విడుదల చేసింది. దీనిలో పెట్రోల్, డీజిల్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.75.80 లక్షలుగా కంపెనీ పేర్కొంది. ఇక డీజిల్ వేరియంట్ ధర రూ.77.80 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పుడు BMW X3 గురుంచి పూర్తిగా చూద్దాం.
ఇంజిన్, పవర్
Related News
BMW X3 లో రెండు ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. దీని పెట్రోల్ ఇంజన్ 180 bhp, 310 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, డీజిల్ ఇంజిన్ 197 bhp 400 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. కొత్త BMWX3 పరిమాణం మునుపటి కంటే పెద్దది. దీని పొడవు 4755 మిమీ, వెడల్పు 1920 మిమీ, ఎత్తు 1660 మిమీ.
అధునాతన లక్షణాలు
కొత్త BMW X3 లో అనేక అధునాతన ఫీచర్లు తో వస్తుంది. ఈ కారులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, కర్వ్డ్ పనోరమిక్ డిస్ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ వాయిస్ అసిస్టెంట్, LCD డిస్ప్లే ఉన్నాయి. ఇక భద్రత కోసం.. లేన్ కీపింగ్ అసిస్టెంట్, దూర నియంత్రణ, యాక్టివ్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్, రియర్ వ్యూ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. BMW యొక్క X3 కారు మెర్సిడెస్ యొక్క GLC కారు, వోల్వో XC60, ఆడి Q5 లతో నేరుగా పోటీ పడనుంది.