వాహనదారులలో Electric vehicles ఆదరణ పెరుగుతోంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా ఈవీ తయారీ కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. Electric scooters, bikes and cars తమ సత్తా చాటుతున్నాయి. EVలకు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ క్రమంలో కార్ ప్రియులకు మరో అద్భుతమైన electric car అందుబాటులోకి వచ్చింది. German luxury car manufacturer BMW new electric model ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లోకి i5 electric sedan ను పరిచయం చేసింది.
BMW cars మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మరింత మంది కస్టమర్లను ఆకర్షించడానికి BMW ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకువస్తుంది. Electric 5 series భాగంగా విడుదల చేసిన మొదటి మోడల్ i5 M60 XDrive. క్రేజీ ఫీచర్లతో నిండిపోయింది. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 516 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. కంపెనీ ఈ కారు ప్రారంభ ధరను రూ.1.20 కోట్లుగా నిర్ణయించింది. ఈ కారు బుకింగ్లు ఏప్రిల్ 5 నుండి ప్రారంభమయ్యాయి. BMW ఇప్పటికే దేశీయ మార్కెట్లో IX1, IX XDrive50, i4 మరియు i7 వంటి electric cars విక్రయిస్తోంది.
i5 M60 XDrive దాని అద్భుతమైన లుక్తో customers లను ఆకట్టుకుంటోంది. ఈ కారు కేవలం 3.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 205 kW AC ఛార్జర్తో కూడిన ఈ car battery కేవలం అరగంటలో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. 14.9 inch touchscreen display , degree camera, electrically గా సర్దుబాటు చేయగల సీట్లు. ఇది బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిమీల వారంటీని అందిస్తుంది.