స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్నో ఉత్తమమైన పథకాలను ప్రారంభించాయి. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలపడాలని ప్రభుత్వం ఈ పథకాల ద్వారా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో, గత సంవత్సరం ఓడిశా ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. దీని పేరు సుభద్ర యోజన.
ఈ స్కీమ్ ద్వారా ఓడిశాలోని మహిళలకు ఏడాదికి రూ.10,000 నిధులను అందిస్తున్నారు. ఈ మొత్తం ప్రతి సంవత్సరం రెండు విడతలుగా అందుతుంది. ఒక్కో విడతలో రూ.5,000 నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ అవుతుంది. ఇది ఓడిశా రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో ఒకటిగా నిలిచింది.
సుభద్ర యోజనకు అర్హత ఎలా?
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే మహిళ వయసు 21 నుండి 60 ఏళ్ల మధ్య ఉండాలి. 21 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారు లేదా 60 ఏళ్లకి పైబడినవారు ఈ పథకానికి అర్హులు కాలేరు. అలాగే ఈ స్కీమ్ ఓడిశా రాష్ట్రం కోసం మాత్రమే. అంటే, ఓడిశాలో పుట్టిన మరియు అక్కడే నివసించే శాశ్వత నివాస ఉన్న మహిళలకే ఈ పథకం వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలకు ఇది వర్తించదు.
Related News
ఆర్థిక అర్హతలు
ఈ పథకానికి అర్హత పొందాలంటే, మహిళ పేరు “నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (NFSA)” లేదా “స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ (SFSS)” లో ఉన్న రేషన్ కార్డులో ఉండాలి. అలాగే మహిళ కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా లేదా ఇన్కం ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేస్తున్నా ఈ పథకం ప్రయోజనం కలగదు.
ఎందుకు ఈ స్కీమ్ స్పెషల్?
ఏటా రూ.10,000 నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వస్తాయి, వయసు 21-60 మధ్య ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది, రేషన్ కార్డ్ కలిగి ఉండే కుటుంబాలకు ప్రాధాన్యత,ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి,చాలా తక్కువ డాక్యుమెంట్లతో లభించే సహాయం,
ఇలాంటి స్కీమ్ మరొకటి లేదు. ఓడిశా మహిళలు ఈ అవకాశాన్ని మిస్ కాకుండా వెంటనే అర్హతను తెలుసుకుని, అవసరమైన పత్రాలతో అప్లై చేయండి. ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మీ ఆర్థిక భద్రతను పెంపొందించుకోండి.