BHIM 3.0లో వచ్చిన కొత్త మార్పులు
భారత ప్రభుత్వం రూపొందించిన BHIM యాప్‌కు ఇది మూడో అతిపెద్ద అప్‌డేట్. సాధారణ వినియోగదారులు, వ్యాపారులు, బ్యాంకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త వెర్షన్‌ను డిజైన్ చేశారు. ఇప్పటి నుంచి ప్రతి రోజు లావాదేవీలు మరింత స్మార్ట్‌గా, సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా మారబోతున్నాయి.
BHIM 3.0లోని ముఖ్య ఫీచర్లు
బిల్ షేరింగ్ సదుపాయం: ఇప్పుడు హౌస్ రెంట్, రెస్టారెంట్ బిల్, గ్రూప్ షాపింగ్ వంటి ఖర్చులను ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్‌తో సులభంగా షేర్ చేసుకోవచ్చు. Split Payment ఫీచర్‌ను ఉపయోగించి ఖర్చులను అందరికీ సమానంగా పంచుకోవచ్చు. ఇది ఖర్చు లెక్కలు సులభంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది.
ఖర్చుల విశ్లేషణ (Expense Analysis)
ఇప్పుడు వినియోగదారులు ప్రతి నెల ఖర్చుల పూర్తి రికార్డు BHIM యాప్‌లో చూడవచ్చు. కొత్తగా వచ్చిన Spend Analytics ఫీచర్ మీ ఖర్చులను వివిధ కేటగిరీలుగా విభజించి చూపిస్తుంది. దీని ద్వారా మంచి బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు, సేవింగ్స్ పెంచుకోవచ్చు.
Related News
ఫ్యామిలీ మోడ్ (Family Mode)
ఇప్పుడు మీ కుటుంబ సభ్యులను BHIM యాప్‌లోకి యాడ్ చేసుకోవచ్చు. వారు చేసే ఖర్చులను మనీటర్ చేయడమే కాకుండా, అవసరమైన పేమెంట్స్‌ను అసైన్ చేయవచ్చు. ఇది కుటుంబ ఆర్థిక పరిస్థితిని సులభంగా నిర్వహించేందుకు సహాయపడుతుంది.
రిమైండర్ అలర్ట్స్
ఇప్పటి నుంచి పెండింగ్ బిల్లులు, UPI Lite యాక్టివేషన్, బ్యాంకు బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు BHIM యాప్ స్వయంగా రిమైండర్లు పంపుతుంది. దీని వల్ల ఏ ముఖ్యమైన లావాదేవీ మిస్ కాకుండా ఉంటాయి.
వ్యాపారులకు ప్రత్యేకంగా BHIM Vega
వ్యాపారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని BHIM Vega అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. వ్యాపారులు ఇకపై యాప్‌లోనే నేరుగా పేమెంట్స్ తీసుకోవచ్చు. కస్టమర్లు ఇతర యాప్స్‌కు మారాల్సిన అవసరం లేకుండా, లావాదేవీలు వేగంగా పూర్తవుతాయి.
BHIM 3.0పై నిపుణుల అభిప్రాయాలు
BHIM 3.0 లాంచ్ సందర్భంగా NPCI డైరెక్టర్ అజయ్ కుమార్ చౌధరీ మాట్లాడుతూ, “BHIM యాప్ భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్‌ను సురక్షితంగా, సులభంగా మారుస్తున్నది. ఇప్పుడు BHIM 3.0 ద్వారా వినియోగదారులు, వ్యాపారులు, బ్యాంకులకు మరింత శక్తివంతమైన ఫీచర్లను అందిస్తున్నాం” అని తెలిపారు.
NBSL CEO లలిత నాటరాజ్ మాట్లాడుతూ,
“భారత వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని BHIM 3.0ను డిజైన్ చేసాము. ఇది సురక్షితంగా, సులభంగా మరియు అందరికీ ఉపయోగపడేలా రూపొందించబడింది.
ఇప్పుడు BHIM యాప్ కేవలం పేమెంట్ యాప్ కాదు! ఇది మీ డిజిటల్ మనీ మేనేజర్… మీ బిల్లులను ట్రాక్ చేయాలా? ఖర్చులు తగ్గించుకోవాలా? ఫ్యామిలీ ఖర్చులను కంట్రోల్ చేయాలా? – ఇవన్నీ BHIM 3.0తో ఒక్క క్లిక్‌లో సులభంగా సాధ్యమే. మీరు ఇంకా BHIM 3.0 అప్డేట్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే అప్డేట్ చేసుకొని కొత్త ఫీచర్లను ఎంజాయ్ చేయండి.