ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఓ కొత్త అడుగు వేసింది. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే బిజినెస్ ఓనర్స్ అవుతారు. వారు నడిపే సొలార్ దుకాణాల ద్వారా నెలకి రూ.20,000 నుంచి రూ.25,000 వరకూ ఆదాయం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ మహిళలకు ఇది గోల్డ్ చాన్స్.
మహిళలే దుకాణాల యజమానులు
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం, “CM యువ సాథి యోజన” పేరుతో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. మొత్తం 3,304 సౌర శక్తితో నడిచే షాపులను మహిళలకు అప్పగించనుంది. జిల్లాల వారీగా ఎంపిక చేసి, ఆయా ప్రాంతాల్లో మహిళలే ఈ షాపులు నడిపేలా చూస్తున్నారు.
పూర్తి సపోర్ట్‌తో స్కీమ్ – ఒక్క రూపాయి పెట్టుబడీ అవసరం లేదు
ఈ షాపులను పెట్టేందుకు అవసరమైన సౌర ప్యానెల్స్, దుకాణ నిర్మాణం, టెక్నికల్ సపోర్ట్ అన్నీ ప్రభుత్వం నుంచే వస్తాయి. మహిళలు ఏ దానికీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అంటే జీరో పెట్టుబడితో షాపు ఓపెన్ చేసే అవకాశం ఇది.
Related News
ఎంపిక ఎలా జరుగుతుంది?
డిస్ట్రిక్ట్ స్థాయిలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు ఈ షాపుల ఏర్పాటును పర్యవేక్షిస్తారు. స్ధానిక స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు మొదట ప్రాధాన్యత ఇస్తారు. మొదటి విడతలో 3,304 షాపులు ప్రారంభమవుతాయి. తర్వాత మరిన్ని దశలుగా ప్రాజెక్ట్ విస్తరించనుంది.
ట్రైనింగ్ కూడా ప్రభుత్వం నుంచే
ఈ షాపులు నడిపే మహిళలకు ప్రభుత్వం శిక్షణ కూడా ఇస్తుంది. షాపు మేనేజ్‌మెంట్, సౌర పరికరాల నిర్వహణ వంటి విషయాల్లో ప్రత్యేక ట్రైనింగ్ ఉంటుంది. అవసరమైతే మరింత టెక్నికల్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది.
ఆర్థిక భద్రత + పర్యావరణ పరిరక్షణ
ఈ స్కీమ్ మహిళలను ఆర్థికంగా స్వతంత్రంగా మార్చటమే కాకుండా, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించనుంది. సౌర శక్తితో నడిచే ఈ షాపులు విద్యుత్‌పై ఆధారపడకుండానే తక్కువ ఖర్చుతో సాగిపోతాయి. అంతేకాదు, స్థానిక స్థాయిలో ఉద్యోగావకాశాలు కూడా కలుగుతాయి.
ఇక ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ఓనర్ అవ్వండి… నెలకు రూ.25,000 వరకు ఆదాయం వస్తుంది… అప్లై చేయకపోతే లైఫ్‌లో ఈ ఛాన్స్ మళ్లీ రావడం కష్టం.