IRCTC: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. IRCTC సేవలకు అంతరాయం

సంక్రాంతి పండుగ నేపథ్యంలో అందరూ తమ స్వస్థలాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రైలు ప్రయాణం కోసం తత్కాల్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి పెద్ద షాక్ తగిలింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్ డౌన్ అయింది.

ఇలా జరగడం ఇది మూడోసారి..

Related News

గత రెండు నెలల్లో IRCTC సేవలు నిలిపివేయడం ఇది మూడోసారి. తత్కాల్ బుక్ చేసుకోవడానికి సరైన సమయంలో ఇలా జరుగుతుండటం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రతిసారీ ఇలా జరుగుతుండడంతో వారు IRCTC అధికారులపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా తాము టిక్కెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామని కొంతమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు.