Panipuri ప్రియులకు షాకింగ్ న్యూస్.. త్వరలో పలు రాష్ట్రాల్లో పానీపూరీ నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా Panipuri గురించి ఎన్నో వార్తలు చూస్తున్నాం.
ఈ మధ్య కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పానీ పూరీని ఎంతో ఇష్టంగా తినడం చూస్తున్నాం. సాయంత్రం వేళల్లో చాట్ బార్లకు వెళ్లి Panipuri ని ఇష్టానుసారంగా తింటూ ఉంటారు. కానీ, పానీపూరీలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని ఎవరికైనా తెలుసా..?
అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన Panipuri తనిఖీల్లో కొన్ని అనుమానాస్పద విషయాలు బయటపడ్డాయి. అందులో పానీ కలర్ రావడానికి కొన్ని రసాయనాలు వాడుతున్నట్లు కన్నడ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో భాగంగా రాష్ట్రంలోని దాదాపు 276 దుకాణాల నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. ఇందులో 41 శాంపిల్స్‌లో కృత్రిమ వర్ణద్రవ్యాలు, cancer కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. కర్ణాటక ప్రభుత్వం పానీపూరీని నిషేధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ రాష్ట్రంతో పాటు మరో రాష్ట్రం కూడాPanipuri నిషేధంపై చర్యలు తీసుకోనుంది.
కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అందించిన సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు చెన్నై వ్యాప్తంగా Panipuri షాపుల్లో తనిఖీలు చేపట్టారు. అయితే తమిళనాడు రాష్ట్రంలోని Panipuri లో కూడా ఇలాంటి అంశాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా పానీ పూరీ నమూనాలను ల్యాబ్‌కు పంపారు.
రిపోర్టు ఆధారంగా Panipuri ని పద్ధతి ప్రకారం నిషేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అత్యున్నత ప్రమాణాలతో తయారు చేసిన షాపుల్లోనే భోజనం చేయాలని తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు సూచించింది. అయితే తాజాగా కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ గోబీ మంచూరియా, కబాబ్స్ వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. కృత్రిమ రంగుల వల్ల పిల్లల్లో అలర్జీ, హైపర్ యాక్టివిటీ, వృద్ధాప్యం వంటి సమస్యలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. వీటిని ఎక్కువ సేపు తీసుకుంటే cancer వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.