BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR కు పెద్ద షాక్ తగిలింది. ఇటీవల, నక్రేకల్ PS లో ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. నకిరేకల్ పట్టణంలో 10వ తరగతి తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు మున్సిపల్ చైర్‌పర్సన్ చౌగోని రజిత, కాంగ్రెస్ నాయకులు KTR పై ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు నకిరేకల్ పోలీసులు KTR తో పాటు సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ మన్నె కృష్ణంక్, కొణతం దిలీప్ కుమార్‌పై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్)లో పేపర్ లీక్ అయిందని KTR వెబ్‌సైట్‌లో షేర్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, పేపర్ లీక్ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఒక మైనర్ బాలికతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.