ఇన్షూరెన్స్ ప్రీమియంపై భారీ ఊరట! 5% జీఎస్టీ వస్తుందన్న వార్తతో మార్కెట్ హీట్…

ప్రస్తుతం ఆరోగ్య బీమా మరియు జీవిత బీమా పాలసీలపై 18 శాతం GST వసూల్ అవుతోంది. దీని వల్ల పాలసీ తీసుకునే వారికి బాగా భారంగా మారుతోంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకునే దిశగా ముందుకెళ్తోంది. తాజా సమాచారం ప్రకారం, బీమా పాలసీలపై GSTను పూర్తిగా మినహాయించకపోయినా, 5 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఎప్పుడైనా వస్తే… పాలసీదారులకు ఇది గోల్డ్ ఛాన్స్ అవుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సాధారణంగా, బీమా పాలసీలపై 18% జీఎస్టీ విధించడం వల్ల ప్రజలకు ఖర్చు పెరుగుతోంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందం (GoM) ఈ విషయం పైన చర్చలు జరిపింది. వారు ఇచ్చిన నివేదికలో, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలపై పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని సూచించారు. అయితే, ఆరోగ్య బీమా పై మాత్రం పూర్తిగా మినహాయింపు ఇవ్వడం వల్ల బీమా సంస్థలు Input Tax Credit (ITC) పొందలేవు. దీనివల్ల వారి వ్యయాలు పెరిగిపోతాయి. ఆఖరికి పాలసీ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

దీంతో తుది నిర్ణయంగా బీమా సంస్థలు ట్యాక్స్ క్రెడిట్ వాడుకునేలా చేస్తూ, కేవలం 5 శాతం GST విధించాలన్న దిశగా కేంద్రం ఆలోచిస్తోంది. ఇది ప్రజలపై భారం తగ్గించడమే కాకుండా, ప్రభుత్వానికి ఆదాయ నష్టం కూడా తక్కువ చేస్తుంది. 5 శాతం GST విధించినా బీమా సంస్థలు ITC ఉపయోగించుకోవచ్చు. దీంతో వారు అధిక ప్రీమియం వసూలు చేయాల్సిన అవసరం ఉండదు.

ప్రీమియం భారం లేకుండా

బీమా రంగ నిపుణుల మాటలో చెప్పాలంటే… పాలసీపై పూర్తిగా మినహాయింపు ఇవ్వడం కన్నా, 5 శాతం జీఎస్టీ ఉండటం మంచిదంటున్నారు. ఎందుకంటే పూర్తిగా మినహాయింపు ఇచ్చినపుడు బీమా సంస్థలు వాటి ఖర్చులపై ట్యాక్స్ వాపసు పొందలేవు. ఫలితంగా వారు ఈ భారాన్ని ప్రీమియంగా మన మీదే వేస్తారు. కానీ 5 శాతం జీఎస్టీ ఉంటే, సంస్థలు ట్యాక్స్ వాపసు పొందగలవు. దీనివల్ల బీమా ధరలు మరింత చౌకగా ఉండే అవకాశం ఉంటుంది.

ఇక IRDAI ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, వయసు పైబడిన వారికి అనుగుణంగా ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని సూచనలు వచ్చాయి. 60 ఏళ్లు పైబడ్డ సీనియర్ సిటిజన్లకు ఇది ఎంతో మేలు చేస్తుంది. కానీ ప్రభుత్వం పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని భావించడం లేదు. ఎందుకంటే ఇలా చేస్తే ప్రభుత్వ ఆదాయానికి పెద్ద నష్టం వస్తుంది. ఉదాహరణకు టర్మ్ పాలసీలపై మినహాయింపు వల్ల సుమారు రూ.200 కోట్ల ఆదాయ నష్టం, సీనియర్ సిటిజన్ల ఆరోగ్య పాలసీలపై మినహాయింపు వల్ల రూ.3,000 కోట్ల నష్టం ఉంటుందని అంచనా.

ఇప్పటికే 2022 నుంచి 2024 వరకు ఆరోగ్య బీమా పాలసీలపై సుమారు రూ.21,000 కోట్లు జీఎస్టీ వసూలైంది. ఇప్పుడు ఒకేసారి మినహాయింపు ఇవ్వడం వల్ల ఈ ఆదాయం పూర్తిగా కోల్పోతారు. అందుకే ప్రభుత్వం మధ్యమార్గంగా 5 శాతం జీఎస్టీ విధించాలన్న దిశగా వెళ్తోంది.

మరోవైపు బీమా సంస్థలు కూడా తాము తీసుకునే సేవలపై సుమారు 8 నుంచి 11 శాతం వరకు GST చెల్లిస్తున్నట్టు వెల్లడించాయి. దీనిని వాపసు పొందాలంటే కనీసం 12 శాతం ట్యాక్స్ విధించాలని సూచించాయి. అయితే చాలా మంది మంత్రులు 12 శాతం కంటే 5 శాతం జీఎస్టీనే ప్రజలకు ఉపశమనంగా ఉంటుందని భావిస్తున్నారు.

వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే… జీఎస్టీ మినహాయింపు కన్నా, తక్కువ రేటుతో ITC అవకాశం కల్పించడం బెటర్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. అంటే బీమా సంస్థలు తమ ఖర్చుపై వాపసు పొందగలవు. ప్రజలకు మాత్రం తక్కువ ఖర్చుతో పాలసీలు దొరుకుతాయి.

మొత్తంగా చూస్తే, త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆరోగ్య మరియు జీవిత బీమాలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది జరిగితే, పాలసీ తీసుకునే వారికి ఇది గొప్ప అవకాశమే. మీరు కూడా త్వరగా బీమా పాలసీ తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు సిద్ధంగా ఉండండి. 18 శాతం జీఎస్టీ నుండి 5 శాతానికి తగ్గే రోజు దూరంలో లేదు