ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు (AP ELECTION RESULTS) ఇంకా 5 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ ప రిస్థితుల్లో అధికార వైసీపీకి ఎలక్షన్ కమీషన్ ఊహించని దెబ్బ పడింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైసీపీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు హైకోర్టును, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. అయితే వైసీపీ లేవనెత్తిన అంశాలకు ఈసీ ఘాటుగా సమాధానం ఇచ్చింది. డిక్లరేషన్‌లో గెజిటెడ్ అధికారి సంతకం ఉండి , ముద్ర మరియు హోదా లేనప్పటికీ , ఓటు చెల్లుబాటు అవుతుందని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇది వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బగా కనిపిస్తోంది.
హైకోర్టుకు ఆదేశాలు..!
ఎన్నికల కౌంటింగ్ సమయంలో రిటర్నింగ్ అధికారి అటువంటి పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు చేయాలని EC స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ రాష్ట్ర CEO ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు. దీనికి సంబంధించి CM ఇచ్చిన మెమోపై YCP ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈసీ కొత్త నిబంధనలను రూపొందించిందని YCP పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను ఈరోజు అత్యవసరంగా విచారించేందుకు కోర్టు సిద్ధమైంది. CEO ఇచ్చిన మెమో సరైనదేనని కేంద్ర ఎన్నికల సంఘం లేఖ స్పష్టం చేయడంతో YCP షాక్‌కు గురైంది. మరి హైకోర్టులో తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ వైసీపీలో నెలకొంది.