నిన్నటి నుంచి సోషల్ మీడియా హల్చల్ చేస్తోంది. నిన్న ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు ప్రారంభం కాగా… కెప్టెన్ రోహిత్ శర్మ ఆడకపోవడం పెను ప్రకంపనలు సృష్టించింది.
కోచ్ గంభీర్ ఉద్దేశ్యపూర్వకంగానే రోహిత్‌ను పక్కన పెట్టాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. భారత క్రికెట్ అభిమానులు గంభీర్‌పై విరుచుకుపడుతున్నారు. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించినా ఆడనివ్వలేదని వాపోయారు. అయితే తానేమీ ఆడటం లేదని రోహిత్ స్వయంగా ప్రకటించడంతో కాస్త చల్లబడ్డారు.
అలాంటప్పుడు రిటైరవ్వడు..
Related News
ఈలోగా మరో ఊహాగానాలు ఊపందుకున్నాయి. మొత్తం ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ ఏమాత్రం రాణించలేకపోయాడు. ఫలితంగా చివరి టెస్టులో స్టాండ్స్‌కే పరిమితమయ్యాడు. దీంతో రోహిత్ రిటైర్ అవుతాడని అంతా అనుకున్నారు. మెల్‌బోర్న్ టెస్టు అతడికి చివరి టెస్టు అని క్రికెట్ పండితులు కూడా అంచనా వేశారు. ఇప్పుడు ఆ వార్తలకు కూడా చెక్ పెట్టాడు హిట్ మ్యాన్. తాను రిటైరవడం లేదని… చివరి టెస్టు మాత్రమే ఆడుతున్నానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన ఫామ్ బాగోలేనందున, చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్ తప్పక గెలవాలి కాబట్టి ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. పెర్త్ టెస్టులో కేఎల్ రాహుల్ – యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ జోడీ మారకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఎవరో బయట కూర్చుని తన రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటున్నారని రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. త్వరలోనే మళ్లీ ఫామ్ లోకి వస్తానని… మరికొన్నాళ్లు బాగా ఆడతానని స్పష్టం చేశాడు.