ALERT: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్‌ రైల్వే ప్లాట్‌ఫామ్‌ల మూసివేత!!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభం కానున్న తరుణంలో, రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్టేషన్ పరిధిలోని ఆరు ప్లాట్‌ఫామ్‌లను 100 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో దాదాపు 120 రైళ్లను చర్లపల్లి రైల్వే జంక్షన్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు మళ్లించనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా, భారీ స్కై కాన్‌కోర్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్ వంతెనలు నిర్మించనున్నారు. 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవుతో నిర్మించనున్న భారీ స్కై కాన్‌కోర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రిటైల్ అవుట్‌లెట్‌లు, రెస్టారెంట్లు, కియోస్క్‌లు ఏర్పాటు చేయబడతాయి.

ప్రారంభంలో, ప్లాట్‌ఫామ్‌లు నంబర్ 2-3, 4-5 లలో దాదాపు 50 రోజుల పాటు పనులు కొనసాగుతాయి. అక్కడ పనులు పూర్తయిన వెంటనే, నాలుగు ప్లాట్‌ఫామ్‌లను తిరిగి ప్రారంభించి ప్రారంభిస్తారు. తరువాత, ప్లాట్‌ఫామ్ నంబర్ 10 లో పనులు ప్రారంభమవుతాయి.

Related News