HDFC బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక! 12వ తేదీన బ్యాంకింగ్ సేవలలో కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే కస్టమర్లు ముందుగానే గమనించడం చాలా ముఖ్యం. HDFC బ్యాంక్ ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణలో భాగంగా, కొన్ని బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగవచ్చు.
ఏప్రిల్ 2న తెల్లవారుజామున 2.30 నుండి ఉదయం 6.30 (4 గంటలు) వరకు వివిధ సేవలలో అంతరాయం ఏర్పడుతుందని HDFC బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఈ సిస్టమ్ నిర్వహణలో భాగంగా సంభవించే అంతరాయాలలో చాట్ బ్యాంకింగ్, SMS బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ IVR సేవలలో అంతరాయం ఉండవచ్చు. బ్యాంక్ తన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (CBS)ను కొత్త ప్లాట్‌ఫామ్‌కు అప్‌గ్రేడ్ చేస్తోంది. దాని 93 మిలియన్ల కస్టమర్లకు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యం.
బ్యాంక్ తన కస్టమర్లకు ఇమెయిల్‌లు మరియు సందేశాలను కూడా పంపింది. సిస్టమ్ అప్‌గ్రేడ్ కారణంగా UPI సేవలు, బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఇతర సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది.