తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. వేసవిని పోలి ఉండే ఎండలు మండే ప్రమాదం ఉంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. గురువారం మెదక్‌లో అత్యధిక స్థాయి 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మార్చి 2 వరకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వేడి గాలుల కారణంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, బయటకు వెళ్లేటప్పుడు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు
ప్రాంత ఉష్ణోగ్రత (డిగ్రీలలో)
Related News
1. ఆదిలాబాద్ 35.3
2. భద్రాచలం 35.8
3. హకీంపేట 34.3
4. దుండిగల్ 33.3
5. హన్మకొండ 33
6. హైదరాబాద్ 32.2
7. ఖమ్మం 35
8. మహబూబ్ నగర్ 35
9. మెదక్ 37.2
10. నల్గొండ 32.5
11. నిజామాబాద్ 35.2
12. రామగుండం 34.2
13. పటాన్చెరు 32.2
14. రాజేంద్రనగర్ 32.5
15. హయత్‌నగర్ 31.6