మహిళలకు బెస్ట్ బైక్ .. సింగిల్ ఛార్జీతో 110కి.మీ.. ధర ఎంతో తెలుసా ?

కార్యాలయాలకు వెళ్లే వారి జీవితంలో ద్విచక్ర వాహనం ఒక భాగమైపోయింది. ద్విచక్ర వాహనం ఉంటే ఎక్కడికైనా వెళ్లవచ్చు. ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీలు వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా అద్భుతమైన ఫీచర్లు, అద్భుతమైన డిజైన్లతో బైక్‌లు, స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. అయితే వాహనదారులు బైక్‌ల కంటే స్కూటీలనే ఎక్కువగా కొనేందుకు ఇష్టపడుతున్నారు. బైక్‌లతో పోలిస్తే స్కూటర్‌లు నడపడం సులువుగా ఉండటంతో పాటు గేర్‌లెస్‌గా ఉండటంతో పురుషులతో పాటు మహిళలు కూడా స్కూటర్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ శ్రేణిలో మహిళల కోసం అద్భుతమైన స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హీరో నుంచి వచ్చిన విడా1 ఎలక్ట్రిక్ స్కూటర్ మహిళలకు బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ప్రస్తుతం, అన్నిelectric vehicles are trending లో ఉన్నాయి. బడ్జెట్ ధరల్లో ఈవీలు రావడంతో వాటికి ఆదరణ పెరిగింది. ప్రయాణ ఖర్చు తగ్గించుకోవడానికి, పెట్రోల్ ఖర్చుల నుంచి ఉపశమనం పొందేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. మంచి మైలేజీని కోరుకునే వారి కోసం హీరో కంపెనీ నుండి విడా లైనప్‌లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. Hero Vida1 Plus మరియు Vida 1Pro రెండు వేరియంట్‌లు ఉన్నాయి. Hero Vida V1 Plus మోడల్ బ్యాటరీ సామర్థ్యం 3.44 KW. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

మరియు Vida V1 pro variant  3.94 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలో అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఇవి గంటకు 80 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. ఈ హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్‌లలో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌ఈడీ లైటింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డిస్క్ మరియు డ్రమ్ బ్రేక్‌లు మరియు భద్రత కోసం 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ ధరలు రూ.1.20 లక్షల నుండి రూ.1.50 లక్షల మధ్య ఉన్నాయి (ex- showroom).

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *