చాలా మందికి ఉండే ఆలోచన బిజినెస్ స్టార్ట్ చేయాలని, కానీ ఇందుకు ఉండే సమస్య డబ్బు. మీరు కూడా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉండి డబ్బులు లేకుంటే మీ కోసం కొన్ని స్కీమ్స్ ఉన్నాయి.
ఈ చిన్న వ్యాపార రుణ పథకాలలోని ఇతర రుణాలతో పోలిస్తే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. లోన్ కసం దరఖాస్తు చేస్తే ప్రాసెస్ కూడా వెంటనే అవుతాయి. అంతేకాదు ప్రభుత్వం కొన్ని రుణాలకు వడ్డీ రాయితీని కూడా అందిస్తుంది. వాటి గురించి తెలుసుకుందాం..
MSME రుణ పథకం
చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఈ పథకం అమలు అవుతుంది. ఇందులో మీరు గరిష్టంగా రూ. 1 కోటి వరకు వ్యాపార రుణాన్ని పొందవచ్చు. 8 శాతం వడ్డీ రేటుతో రుణం పొందవచ్చు. లోన్ దరఖాస్తు ప్రక్రియలు 8 నుండి 12 రోజుల్లో పూర్తవుతుంది. మంచి బిజినెస్ ఆలోచన ఉండి.. పెద్ద మొత్తంలో మూలధనం లేనివారు ఇక్కడ రుణం పొందవచ్చు.
SIDBI
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI). చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన వ్యక్తులు ఇందులో సులభంగా రుణాలు పొందవచ్చు. 10 లక్షల నుంచి 25 కోట్ల వరకు రుణం లభిస్తుంది. రుణ చెల్లింపు వ్యవధి 10 సంవత్సరాల వరకు నిర్ణయిస్తారు. కోటి రూపాయల వరకు రుణాలకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు.
ప్రధాన మంత్రి ముద్ర యోజన
ఇది సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఎలాంటి పూచీ లేకుండా రుణ పథకం అందిస్తుంది. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఇది ఒక ప్రత్యేక పథకం అని చెప్పవచ్చు. రుణాన్ని తిరిగి చెల్లించడంలో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పథకం కింద రుణం రూ.20 లక్షల వరకు పెంచారు. ఇందులో శిశు రుణాల కింద రూ.50000, కిషోర రుణం కింద రూ.50000 వేల నుంచి రూ.5లక్షల వరకు, అలాగే తరుణ్ ప్లస్ రూ.20 లక్షల వరకు పొందవచ్చు.
క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్
వ్యాపారంలో సాంకేతిక అప్‌డేట్‌లు చేయాలనుకునే వారికి ఇది సహాయకరంగా ఉంటుంది. ఇది తయారీ, మార్కెటింగ్ మొదలైన అనేక పరిశ్రమలలో ఉపయోగించవచ్చు. ఈ కార్యక్రమం ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారికి, దానిని మెరుగుపరచడానికి, కొత్త సాంకేతికతలను పరిచయం చేయడానికి బాగుంటుంది.
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్
ఈ స్కీమ్ ఆర్థిక, మార్కెటింగ్, సాంకేతిక సౌకర్యాలను అందిస్తుంది. చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి రుణం మాత్రమే కాకుండా ఉత్పత్తిని ఎలా మార్కెటింగ్ చేయాలి? ఎలా ప్లాన్ చేయాలి? వ్యాపారాన్ని ఎలా మెరుగుపరచాలి? అనే విషయాలలో సహాయం కూడా అందిస్తారు. అందువల్ల ఇది చిన్న వ్యాపారవేత్తలకు మంచి పథకం.