లోన్ తీసుకున్నారా? ఇలా ప్లాన్ చేస్తే వడ్డీ భారం తగ్గించుకోవచ్చు.. మీ డెట్ కంట్రోల్ లోకి తీసుకురండి…

ఆన్‌లైన్ లోన్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి? (Loan Management Best Tips)

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రస్తుతం డిజిటల్ యుగంలో వ్యక్తిగత రుణాలను నిర్వహించడం చాలా సులభమైంది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తమ కస్టమర్లకు మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా లోన్ వివరాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. దీని వల్ల వడ్డీ భారం తగ్గించుకోవచ్చు, బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ లోన్‌ను సరిగ్గా నిర్వహించేందుకు అవసరమైన ముఖ్యమైన టిప్స్ చూద్దాం

1) అధిక వడ్డీ ఉన్న రుణాలను తొలగించండి

మీ వద్ద ఉన్న అన్ని రుణాలను లిస్ట్ చేసి, వాటి వడ్డీ రేట్లను పరిశీలించండి. సాధారణంగా క్రెడిట్ కార్డు మరియు పర్సనల్ లోన్స్‌పై అధిక వడ్డీ ఉంటుంది. మొదట వీటిని కడిగేసుకుంటే, మీరు భవిష్యత్తులో ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Related News

2) డెట్ కన్సాలిడేషన్‌ను పరిశీలించండి

ఒకే తక్కువ వడ్డీ రేటుతో ఉన్న లోన్ తీసుకుని, మిగతా రుణాలను క్లీన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, క్రెడిట్ కార్డు బకాయిలు, పర్సనల్ లోన్స్‌ను కలిపి, తక్కువ వడ్డీ ఉన్న హోమ్ లోన్ లేదా ఇతర లోన్‌తో సెటిల్ చేసుకోవడం మంచిది.

3) EMI మొత్తం పెంచండి

మీకు జీతం పెరిగినప్పుడు లేదా అదనపు ఆదాయం వచ్చినప్పుడు, EMI మొత్తాన్ని పెంచండి. ఇలా చేయడం వల్ల మీరు త్వరగా లోన్ పూర్తిగా తిరిగి చెల్లించగలరు మరియు మొత్తం వడ్డీ తగ్గించుకోవచ్చు.

4) అదనపు ఆదాయాన్ని లోన్ చెల్లింపుకు వాడండి

బోనస్, ట్యాక్స్ రిఫండ్, ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్స్ వచ్చినప్పుడు అవి ఖర్చు పెట్టకుండా లోన్ క్లియర్ చేసేందుకు ఉపయోగించండి. ఇది మీ లోన్ గడువు తగ్గించడమే కాకుండా వడ్డీని తగ్గిస్తుంది.

5) సమయానికి EMI చెల్లించండి

ఒక EMI మిస్సయితే ఫైన్ వేసే అవకాశం ఉంది. అంతేకాదు, మీ క్రెడిట్ స్కోర్ కూడా ప్రభావితం అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే, ఆటో-డెబిట్ సెటప్ చేసుకోవడం లేదా మీ మొబైల్‌లో రిమైండర్ సెట్ చేసుకోవడం మంచిది. క్రెడిట్ స్కోర్ మెరుగుపడితే, భవిష్యత్తులో తక్కువ వడ్డీకి లోన్ పొందే అవకాశం ఉంటుంది.

6) అవసరం లేని ఖర్చులను తగ్గించండి

రుణ భారం తగ్గించుకోవాలంటే, లగ్జరీ ఖర్చులు తగ్గించాలి. రెస్టారెంట్లు, వీకెండ్ ట్రిప్స్, అవసరం లేని షాపింగ్ వంటి ఖర్చులను తగ్గించి, ఆ డబ్బును లోన్ తక్కువ చేయడానికి ఉపయోగించండి.

గమనిక 

పర్సనల్ లోన్స్ అత్యవసర ఖర్చుల కోసం చాలా ఉపయోగపడతాయి, కానీ వాటిపై అధిక వడ్డీ ఉంటుంది. సరైన ప్లానింగ్ లేకపోతే, మీరు డెట్ ట్రాప్‌లో పడే ప్రమాదం ఉంది. పై సూచనలను పాటిస్తే, మీ ఆర్థిక పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు.

మీరు కూడా లోన్ భారాన్ని తగ్గించుకోవాలనుకుంటే, ఈ టిప్స్ ఫాలో అవ్వండి – ఇప్పుడే స్టార్ట్ చేయండి