బంగారం ధర తగ్గుతుందా? ఎంతవరకు పడిపోతుంది?
బంగారం ధర త్వరలోనే తగ్గే అవకాశం ఉందని కమోడిటీ నిపుణులు కిశోర్ నార్నే వెల్లడించారు. $300 – $400 (సుమారు 5% – 8%) తగ్గే అవకాశం ఉంది. దీనిని భారత రూపాయిలలో లెక్కిస్తే, 10 గ్రాముల బంగారం ధర రూ.9,200 నుండి రూ.12,200 వరకు తగ్గవచ్చు. ఇది కొత్తగా బంగారం కొనాలనుకునేవారికి గోల్డెన్ ఛాన్స్.
బంగారం రేటు భవిష్యత్తులో ఎంత వరకు పెరుగుతుందో తెలుసా?
అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత వల్ల బంగారం డిమాండ్ భారీగా పెరుగుతోంది. నిపుణుల అంచనాల ప్రకారం, బంగారం ధర 2025 నాటికి రూ.1,37,000 ను తాకే అవకాశం ఉంది. ఇక, దీర్ఘకాలంలో $4000 – $4500 వరకు బంగారం ధర చేరుకుంటుందని అంచనా. అంటే భారత కరెన్సీలో రూ.3,42,240 నుంచి రూ.3,85,020 వరకు వెళ్ళే అవకాశముంది.
ఇప్పుడు బంగారం కొంటే నష్టమా? లేదా?
ప్రస్తుతం బంగారం అత్యధిక ధర వద్ద ఉంది, కానీ కొన్ని రోజుల్లో భారీ తగ్గుదల వచ్చి, మళ్ళీ రేటు ఎగిసిపోవచ్చు. ఈ తగ్గుదలలోనే బంగారం కొనటం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి కొనాలనుకుంటున్న వారు కొంతకాలం వేచి చూడడం మంచిది.
Related News
మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.. మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? లేక వేచి చూస్తారా?