Phonepe, Google pay లో కరెంట్ బిల్ కడుతున్నారా? RBI కొత్త రూల్ తెలుసుకోండి!

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపులు బాగా పెరిగాయి. అన్ని చెల్లింపులు డిజిటల్‌గా జరుగుతాయి. నిత్యావసర వస్తువుల నుంచి అనేక ఇతర వస్తువుల వరకు ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. ముఖ్యంగా కరెంట్ బిల్లు, టీవీ బిల్లు, ఫోన్ రీచార్జ్ వంటివి Phone Pay, Google Pay, Paytm వంటి వాటి ద్వారానే జరుగుతాయి.అయితే సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కరెంట్ బిల్లు చెల్లించే వారికి తెలంగాణ విద్యుత్ శాఖ ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. ఇక నుంచి వారి ద్వారా కరెంట్ బిల్లు చెల్లించడం కుదరదని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రస్తుతం, అనేక ఆన్‌లైన్ చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లు వివిధ రకాల బిల్లులను చెల్లించడానికి Google Pay, Phone Pay, Paytm మొదలైన వాటిని ఉపయోగిస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు చాలా మంది వీటి ద్వారా కరెంట్ బిల్లు వంటి నగదును కూడా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అయితే గతంలో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే వారు ఇక నుంచి వాటి ద్వారా చెల్లింపులు చేయలేరు. అయితే తెలంగాణ విద్యుత్ శాఖ మాత్రం గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపును నిలిపివేసింది.

ఈ క్రమంలో విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్ పీడీసీఎల్ కీలక సూచన చేసింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల వంటి సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపును నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో నేటి నుంచి టీజీఎస్ పీడీసీఎల్ వెబ్‌సైట్‌లో కరెంట్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే.. పీడీసీఎల్‌కు సంబంధించిన మొబైల్ యాప్ ద్వారా చెల్లించాలని టీజీఎస్ వినియోగదారులను కోరింది. ఈ నెల నుంచి ఫోన్ పే, గూగుల్ పే తదితరాలతో కరెంట్ బిల్లు చెల్లించడం సాధ్యం కాదు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. వారి మేరకు టీజీఎస్ పీడీసీఎల్ ఈ నిర్ణయం తీసుకుంది.

Related News