పర్సనల్ లోన్ తీసుకునే ముందు, వడ్డీ రేట్లను సరిపోల్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వడ్డీ రేటు ఎంత తక్కువ ఉంటే, మీ నెలసరి ఈఎంఐ (EMI) అంత తక్కువగా ఉంటుంది. పర్సనల్ లోన్‌లో – వడ్డీ రేట్లు, ఈఎమ్ఐ (EMI), మరియు టెన్యూర్ ముఖ్యమైన విషయాలు
ఈఎమ్ఐ (EMI) ఎలా నిర్ణయించబడుతుంది?
మీ పర్సనల్ లోన్‌కు సంబంధించి వడ్డీ రేటు, మీ నెలసరి ఈఎంఐను ప్రభావితం చేసే ప్రధాన అంశం:
- క్రెడిట్ స్కోర్ – 700 పైగా ఉన్న వారికి తక్కువ వడ్డీ రేటు.
- జీతం – ఎక్కువ జీతం పొందేవారికి తక్కువ వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది.
- ఉద్యోగ సంస్థ – ప్రభుత్వ ఉద్యోగులకు, పెద్ద కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు తక్కువ వడ్డీ రేటు ఉంటుంది.
- లోన్ మొత్తం – ఎక్కువ మొత్తం అప్పు తీసుకుంటే, కొన్నిసార్లు తక్కువ వడ్డీ రేటు పొందే అవకాశముంటుంది.
ప్రముఖ బ్యాంకుల పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు (2025)
- HDFC బ్యాంక్ – 10.85% నుండి 24% వరకు. ప్రాసెసింగ్ ఫీజు ₹6,500 వరకు.
- ICICI బ్యాంక్ – 10.85% నుండి 16.65% వరకు. ప్రాసెసింగ్ ఫీజు 2%.
- Federal బ్యాంక్ – 11.49% నుండి 14.49% వరకు.
- Kotak Mahindra బ్యాంక్ – 10.99% నుండి 16.99% వరకు. ప్రాసెసింగ్ ఫీజు 5% వరకు.
- State Bank of India (SBI) – 12.60% నుండి 14.60% (కార్పొరేట్ ఉద్యోగులకు).
- Bank of Baroda – 12.15% నుండి 18.50% (ప్రైవేట్ ఉద్యోగులకు).
- Union Bank of India – 11.50% నుండి 15.20% వరకు.
తక్కువ వడ్డీ రేటుకు లోన్ పొందాలంటే?
- క్రెడిట్ స్కోర్ 700+ మెయింటైన్ చేయండి
- ఉద్యోగం మరియు జీత వివరాలు స్పష్టంగా ఇచ్చేలా చూడండి
- ప్రముఖ బ్యాంకుల రేట్లను పోల్చి, తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకును ఎంచుకోండి
- ప్రాసెసింగ్ ఫీజులను కూడా పరిశీలించండి
*గమనిక: లోన్ తీసుకోవడం ఆర్థిక భారం కలిగించవచ్చు. మీ తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేసుకొని నిర్ణయం తీసుకోండి.
Related News
ఇక ఆలస్యం ఎందుకు? మీరు తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ పొందగలరా? మీ స్కోర్ మరియు అర్హతను ఇప్పుడే చెక్ చేసుకోండి!