ఇది 12 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య. మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి వివరాలు ఇందులో నమోదు అవుతాయి. ఈ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాల్లో అర్హత దొరకుతుంది. రేషన్ కార్డు లేని కుటుంబాలు ఫ్యామిలీ ఐడీ తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రేషన్ కార్డు లేకుంటే, ఫ్యామిలీ ఐడీ తప్పనిసరి
రేషన్ కార్డు లేనివారు ప్రభుత్వ పథకాలను మిస్ కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం “ఒక కుటుంబం – ఒక గుర్తింపు” (One Family One Identity) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది 75,494 కుటుంబాలకు ఫ్యామిలీ ఐడీ మంజూరు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. ఇది ముందుగానే రేషన్ కార్డు ఉన్నవారికి అవసరం లేదు, కానీ రేషన్ కార్డు లేని కుటుంబాలకు మాత్రం తప్పనిసరి.
ఫ్యామిలీ ఐడీ ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఎలా పొందాలి?
ఈ ఫ్యామిలీ ఐడీ కార్డు వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందడం మరింత సులభం అవుతుంది. మీరు మీ కుటుంబంతో సహా అన్ని ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులా కాదా అనే దాన్ని ఇది నిర్ధారిస్తుంది.
Related News
ఫ్యామిలీ ఐడీ ఎలా పొందాలి?
ఫ్యామిలీ ఐడీ పోర్టల్ (Family ID Portal) లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. మీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ నంబర్ ద్వారా మీ కుటుంబ వివరాలను పొందుపరచుకోవచ్చు. మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసి, OTP ద్వారా వెరిఫై చేయాలి. మీ కుటుంబానికి ఇప్పటికే రేషన్ కార్డు ఉందా లేదా అనేది ఫ్యామిలీ ఐడీ పోర్టల్‌లో లాగిన్ చేసి తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు లేనివారు తమ మొబైల్ ద్వారా లేదా ప్రభుత్వ కేంద్రం వద్ద నమోదు చేసుకోవచ్చు.
ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యం పెట్టుకుంది
ఈ ఫ్యామిలీ ఐడీ కార్డు తీసుకోవడం ద్వారా మీ కుటుంబానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాలు మిస్సవకుండా పొందే వీలుంటుంది. ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోకూడదనుకుంటే, మీ ఫ్యామిలీ ఐడీ కార్డు వెంటనే తీసుకోండి. అలసత్వం చేస్తే, మీకు రావాల్సిన అనేక ప్రయోజనాలు మిస్ అవుతాయి.