మీకు కోపం ఎక్కువా..? ఈ విటమిన్లు కావాలి…

కొన్ని రకాల విటమిన్లు మన శరీరంలో లోపించడం వల్ల కూడా మనిషికి చీటికి మాటికి కోపం వస్తుందట.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

విటమిన్‌ బి6 లోపం ఉంటే తరచూ కోపం వస్తుందని లేటెస్ట్‌ రిసెర్చ్‌లో తేలింది. మెదడు చురుగ్గా పనిచేసేందుకు విటమిన్ బి6 ఉపయోగపడుతుందని…అందుకే ఈ విటమన్ ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనలో చాలా మందికి కోపం ఎక్కువగా రావడానికి బీ12 లోపం కూడా కారణమట.

బీ12 లోపం కారణంగా నీరసంతో పాటు అలసట కూడా తొందరగా వస్తుందట. కొంచెం పని చేసిన అలసిపోవడమే కాకుండా…డిప్రెషన్‌కు కూడా బీ12 లోపం కారణమవుతుందట.

శరీరానికి కావలసిన జింక్‌ అందనప్పుడు మనిషి మానసికంగా బలహీనవుతాడట. ఆందోళన, చిరాకు, డిప్రెషన్ లాంటి సమస్యలు వేధిస్తాయట.

మెగ్నిషియం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెగ్నీషియం కూడా నిత్యం ఆహారం ఉండేలా చూసుకోవాలి.

జింక్‌, మెగ్నీషియం, బీ6, బీ12 ఎక్కువగా ఉండే పచ్చి ఆకుకూరలు, అవకాడో, మాంసంతోపాటు…చిక్కుల్లు, రాజ్‌ మా, చేపలు, బ్రోకలీ, మొలకెత్తిన ధాన్యలు లాంటి పదార్థాలను నిత్యం ఆహారంలో భాగంగా తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు