APSRTC: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్.. 7,200 బస్సుల్లో భారీ డిస్కౌంట్

సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రజలకు ఓ శుభవార్త అందించింది. సంక్రాంతి సందర్భంగా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

సంక్రాంతి పండుగ దృష్ట్యా 7,200 అదనపు బస్సులను నడపాలని APSRTC నిర్ణయించింది. తెలంగాణ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలకు ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ఆర్టీసీ ఈ చర్యలు చేపట్టింది.

ఆర్టీసీ ఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 8 నుంచి 13 వరకు 3,900 ప్రత్యేక బస్సులు.. హైదరాబాద్ నుంచి: 2,153 ప్రత్యేక బస్సులు, బెంగళూరు నుంచి: 375 ప్రత్యేక బస్సులు, విజయవాడ నుంచి: 300 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. తిరుగు ప్రయాణం కోసం జనవరి 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని ఆర్టీసీ ఎండీ ప్రకటించారు. సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తారు. మీరు ఒకేసారి రెండు వైపులా టిక్కెట్లు బుక్ చేసుకుంటే, మీకు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించేందుకు ముందస్తుగా టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు.

సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలనుకునే ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల ద్వారా సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఎంచుకోవాలని సూచించారు. APSRTC ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని ఉపయోగించడం మరియు ముందస్తుగా టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం ద్వారా, మీరు పండుగ రద్దీలో టెన్షన్ లేకుండా సులభంగా ప్రయాణించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *