APRJC Results 2024 : ఏపీఆర్‌జేసీ ‘Phase-2’ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

APRJC Phase 2 Results: ఏపీలోని గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం ఏప్రిల్ 25న నిర్వహించిన ఏపీఆర్‌జేసీ-2024 ప్రవేశ పరీక్ష మొదటి దశ (ఫేజ్-1) ఫలితాలు మే 14న విడుదలైన సంగతి తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

అయితే రెండో దశ (Phase-2) ఫలితాలు మే 29న విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ID మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ, స్థానికత ఆధారంగా అభ్యర్థులకు గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఫస్టియర్‌లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

‘APRJCఫేజ్-2’ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల నిర్వహణలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్ల కోసం ఏపీఆర్జేసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఆర్జేసీ సీఈటీ)-2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభమైంది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్ష హాల్ టిక్కెట్లు ఏప్రిల్ 17న విడుదలయ్యాయి. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలు మే 14న వెల్లడికానున్నాయి.

APRJC ప్రవేశ పరీక్షకు 49,308 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంటర్ మొదటి సంవత్సరంలో గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. ఆయా కాలేజీల్లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో సీట్లు భర్తీ చేస్తారు. ఇంటర్ కోర్సుల వారీగా సీట్లు భర్తీ చేసేందుకు మే 22 నుంచి 25 వరకు మొదటి రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. మే 28 నుంచి 30 వరకు రెండో విడత; మూడో విడత కౌన్సెలింగ్‌ జూన్‌ 5 నుంచి 7 వరకు జరగనుంది.

Official Website for Results

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *