ALERT: APRJC, APRDC సెట్ దరఖాస్తుల స్వీకరణ..లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని రెసిడెన్షియల్ జూనియర్ (APRJC), డిగ్రీ కళాశాలల (APRDC) ప్రవేశాలకు వేర్వేరు నోటిఫికేషన్‌లు విడుదలయ్యాయి. 10వ తరగతి పాసైన వారు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ పాసైన వారు డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించడం ప్రారంభించిన విషయం తెలిసిందే. చివరి తేదీ మార్చి 31గా ప్రకటించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్లు ఏప్రిల్ 17న విడుదల చేయబడతాయి. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న నిర్వహించబడుతుంది. ఫలితాలు మే 14న విడుదల చేయబడతాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 1,149 సీట్లు ఉండగా, డిగ్రీ కళాశాలలో 220 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌లో MPC, BiPC, MEC, CEC, EET, CGT గ్రూపులు ఉన్నాయి. డిగ్రీలో బిఎ పొలిటికల్ సైన్స్, బికాం కంప్యూటర్ అప్లికేషన్స్, బికాం టాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీస్, బిఎస్సి కెమిస్ట్రీ, బిఎస్సి కంప్యూటర్ సైన్స్, బిఎస్సి డేటా సైన్స్, మరియు బిఎస్సి జువాలజీ కోర్సులు ఉన్నాయి.

ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. సీటు పొందిన వారికి విద్య మరియు వసతి సౌకర్యాలు కల్పించబడతాయి. దరఖాస్తు రుసుము రూ. 300. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://aprs.apcfss.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Related News