
దిల్లీ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB) 2025 సంవత్సరానికి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2119 ఖాళీలకు అభ్యర్థులను నియమించబోతున్నారు. ఆసిస్టెంట్, వార్డెన్, టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, టీచర్, సైన్స్ అసిస్టెంట్ వంటి పలు పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల అయింది.
ఈ పోస్టుల కోసం పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఎడ్, బీటెక్, ఎం.ఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి విద్యార్హతలు ఉండాలి. అభ్యర్థులు తమ అర్హతకు అనుగుణంగా సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం పోస్టును బట్టి మారుతుంది. కనిష్టంగా రూ.19,900 నుండి గరిష్టంగా రూ.1,51,100 వరకు జీతం ఇవ్వబడుతుంది. ఇది చాలా గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.
వార్డెన్ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. మగ అభ్యర్థులకు 1676 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఆసిస్టెంట్ పోస్టులు 120 ఉన్నాయి. టెక్నీషియన్ పోస్టులు 70, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 30 ఉన్నాయి. వీటితో పాటు పీజీటీ టీచర్లు, ఫార్మసిస్ట్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ వంటి అగ్రశ్రేణి ఉద్యోగాలకూ అవకాశాలున్నాయి.
[news_related_post]దరఖాస్తు ప్రక్రియ 2025 జూలై 8 మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ 2025 ఆగస్టు 7 రాత్రి 11:59 వరకు మాత్రమే. అందుకే అవకాశం మిస్సవకుండా వెంటనే అప్లై చేయండి. దీనికోసం అధికారిక వెబ్సైట్ dsssb.delhi.gov.in ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పించాలి.
అభ్యర్థుల వయస్సు కూడా పోస్టు ఆధారంగా నిర్ణయించబడుతుంది. కొన్ని పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్టంగా 32 సంవత్సరాల వరకు అనుమతించబడుతుంది.
దరఖాస్తు ఫీజు చూస్తే, సాధారణ అభ్యర్థులకు రూ.100 మాత్రమే. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు ఎక్స్ సర్వీస్మెన్లు మాత్రం ఫీజు మినహాయింపు పొందవచ్చు.
ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు ఒక్కసారి ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. DSSSB నియామకం ద్వారా వచ్చే జాబ్స్ చాలా ప్రెస్టీజియస్ గా ఉండటమే కాకుండా, జీతం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. మీ విద్యార్హతకు తగిన ఉద్యోగం ఉండే అవకాశముంది కాబట్టి ఈ ఛాన్స్‌ని మిస్ అవ్వకండి!