LIC హౌసింగ్ ఫైనాన్స్ (LIC HFL) సంస్థ 2025 సంవత్సరానికి సంబంధించి భారీ నియామక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 250 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉంటే, ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ జూన్ 13, 2025 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 28, 2025.
ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు స్టైపెండ్ కూడా చెల్లిస్తారు. పరీక్ష ఫీజు మాత్రం కేటగిరీపై ఆధారపడి ఉంటుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.944, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు రూ.708, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.472గా నిర్ణయించారు.
జూలై 3న స్కిల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు జూలై 8 నుంచి 9 తేదీల మధ్య డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఫైనల్ సెలక్షన్ తర్వాత అభ్యర్థులకు జూలై 10 నుంచి 11 మధ్య ఆఫర్ లెటర్లు ఇవ్వనున్నారు. ఆఫర్ లెటర్ అంగీకరించినవారు జూలై 14న తమ శిక్షణ బ్రాంచ్‌లో రిపోర్ట్ కావాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో కొంత రిలాక్సేషన్ ఉంటుంది. ఎంపికైనవారికి LIC HFL బ్రాంచ్‌లో శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణలో భాగంగా వారికి నిబంధనలతో కూడిన శిక్షణ వ్యవస్థ, నెలవారీ స్టైపెండ్, ఇతర రూల్స్ తెలియజేయబడతాయి.
ఇంతటి మంచి అవకాశం ఇక మిస్ అవ్వకండి. డిగ్రీ అయిపోయినవారంతా వెంటనే LIC HFL అధికార వెబ్‌సైట్ అయిన lichousing.comలోకి వెళ్లి అప్లై చేసేయండి. అప్లికేషన్, నోటిఫికేషన్ సంబంధిత పూర్తి వివరాలు అక్కడ అందుబాటులో ఉంటాయి.
ఇది మీ కెరీర్‌ను ప్రారంభించేందుకు గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు!