Teacher transfers GO: రేపే టీచర్ల బదిలీల జీవో.. ప్రభుత్వంతో చర్చలు సఫలం.

అమరావతి, మే 20: ఉపాధ్యాయ సంఘాలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఉద్యోగ సంఘాలు తమ ఉద్యమ కార్యకలాపాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాయి. అయితే, సమాంతర మీడియా అంశంపై మంత్రి నారా లోకేష్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పాఠశాల విద్యా కార్యదర్శి కోన శశిధర్ సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక తరపున జరిగిన చర్చలు ఫలితాన్నిచ్చాయని వారు ప్రకటించారు. SGTలను మాన్యువల్‌గా బదిలీ చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని వారు తెలిపారు. రోల్ 49 దాటిన తర్వాత ఉన్నత పాఠశాలల్లో 2వ section  ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.

Also Read: Calculat your Transfer points here

Related News

రోల్ 20 దాటిన తర్వాత ఫౌండేషన్ పాఠశాలల్లో 2వ పోస్టును ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది.. ఉన్నత పాఠశాలల్లో నడుస్తున్న ప్రాథమిక పాఠశాలలను విడిగా నడపడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. పనిభారం పెరిగిన సందర్భంలో పెరిగిన పనిభారం ఉన్న సబ్జెక్టులకు అవసరమైన విధంగా విద్యా బోధకులు మరియు మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది.

అంగీకరించిన అంశాలు :-
1)SGT లకు మాన్యువల్ పద్దతిలో బదిలీలు నిర్వహిస్తారు.
2) ఉన్నతపాఠశాలల్లో 49 దాటిన తరువాత 2 వసెక్షన్ ఏర్పాటు చేస్తారు.
3) ఫౌండేషన్ పాఠశాలల్లో 20 రోల్ దాటిన తరువాత 2వ పోస్టు ఇస్తారు.
4) ఉన్నతపాఠశాలల్లో నిర్వహించే ప్రాధమిక పాఠశాలలు విడిగా నిర్వహిస్తారు.
5) వర్క్ లోడ్ ఎక్కువయ్యే సందర్భంలో వర్క్ లోడ్ ఉన్న సబ్జెక్టులకు అవసరంమేరకు అకడమిక్ ఇన్ స్ట్రక్టర్/సర్ప్లస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు.
6) స్టడీ లీవ్ లో ఉన్న ఉపాధ్యాయులు ఆగస్టు 2025 లోపు చేరే వారి స్థానాలను బదిలీలలో ఖాళీగా చూపరు.
7)ప్రస్తుత బదిలీలలో బ్లాకింగ్ ఉండదు.
8) మోడల్ ప్రాధమిక పాఠశాలల్లో 1382 పి.ఎస్.హెచ్.ఎం పదోన్నతులు కల్పిస్తారు.(ఇవి ఇంకా పెరగనున్నాయి)
9)2సార్లు రీ అపోర్షన్మెంట్ కి గురయ్యే ఉపాధ్యాయులకు 7 పాయింట్లు ఇస్తారు.
10) ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారానికి జూన్ నెలలో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
11) బదిలీల అనంతరం ఎంఈఓ, ప్రధానోపాధ్యాయుల పరస్పర బదిలీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
11)మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 120 దాటినపుడు పి.ఎస్.హెచ్.ఎం అదనంగా (1+5) కేటాయిస్తారు.

పెండింగ్ అంశాలు:-

సమాంతర మాధ్యమం విషయం విద్యాశాఖ మంత్రి గారితో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటారు.

రేపే బదిలీల షెడ్యూల్ విడుదల !

✅ 1. మొదట ఆన్లైన్ దరఖాస్తు
➡️ ప్రతి ఉపాధ్యాయుడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

✅ 2. ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్
➡️ జిల్లా స్థాయిలో తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు.

✅ 3. అభ్యంతరాల సమర్పణ
➡️ ప్రొవిజనల్ లిస్టుపై తప్పులుంటే అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చు.

✅ 4. ఫైనల్ సీనియారిటీ లిస్ట్
➡️ పరిశీలన అనంతరం తుది సీనియారిటీ జాబితా విడుదల.

✅ 5. ఆప్షన్స్ ఎంపిక
➡️ ఉపాధ్యాయులు తమకు ఇష్టమైన పాఠశాలల ఎంపిక చేసుకోవాలి.

✅ 6. SGT లకు మాన్యువల్ బదిలీలు
➡️ SGTల బదిలీలు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తారు.
➡️ ఆప్షన్స్ ఆన్‌లైన్ లో ఉండవు.

✅ 7. బదిలీ ఉత్తర్వులు
➡️ ఎంపికైన స్కూల్‌కి సంబంధించి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ విడుదల అవుతాయి

Transfer Entitlement poins: పాయింట్ల కేటాయింపు విధానం:

* కేటగిరీ-1 (పట్టణ ప్రాంతాలు): సంవత్సరానికి 1 పాయింట్
* కేటగిరీ-2 (మునిసిపల్ ప్రాంతాలు): సంవత్సరానికి 2 పాయింట్లు
* కేటగిరీ-3 (గ్రామీణ ప్రాంతాలు): సంవత్సరానికి 3 పాయింట్లు
* కేటగిరీ-4 (మారుమూల ప్రాంతాలు): సంవత్సరానికి 5 పాయింట్లు
* పని చేసిన మొత్తం సర్వీస్ కాలానికి: సంవత్సరానికి 0.5 పాయింట్లు
* భార్యభర్తలు ప్రభుత్వ ఉద్యోగులైతే: 5 పాయింట్లు (ఒకరికి మాత్రమే వర్తిస్తుంది)
* అవివాహిత మహిళా ఉపాధ్యాయులకు: 5 పాయింట్లు
* 40%-55% శారీరక వైకల్యం లేదా 60%-70% వినికిడి లోపం ఉన్నవారికి: 5 పాయింట్లు
* 40% దృష్టిలోపం లేదా 56%-59% శారీరక వైకల్యం ఉన్నవారికి: 7 పాయింట్లు
* ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు/కార్యదర్శులకు: 5 పాయింట్లు
* విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకోని మహిళా టీచర్లు, సైనిక విభాగాల్లో పని చేసి టీచర్లుగా ఉన్నవారికి: 5 పాయింట్లు
* స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్‌ను 2 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు: 5 పాయింట్లు
* పునర్విభజనలో తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులకు: 5 పాయింట్లు.

ప్రాధాన్యత (Preferential Category):

* వందశాతం దృష్టిలోపం లేదా 80% పైగా శారీరక వైకల్యం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత
* 75% దృష్టిలోపం, 70%-79% శారీరక వైకల్యం లేదా 70% పైగా వినికిడి లోపం ఉన్నవారికి రెండో ప్రాధాన్యత
* పునర్వివాహం చేసుకొని వితంతువులు
* క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోనోటీసీ, కిడ్నీ మార్పిడి, డయాలసిస్, స్పైనల్ సర్జరీ చేసుకున్న వారు
* జీవిత భాగస్వామి లేదా పిల్లలు జుననైల్ డయాబెటిస్, తలసేమియా, హీమోఫిలియా, కండరాల క్షీణతతో బాధపడుతున్నవారికి వైద్య చికిత్స పొందుతున్నవారు.